IAF ఉద్యోగాలు: గ్రూప్ ఎక్స్ గ్రూప్ వై పరీక్షకు అడ్మిట్ కార్డు విడుదల: ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..!!
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ ఎక్స్ మరియు గ్రూప్ వై ఎగ్జామినేషన్ 2021కు సంబంధించి అడ్మిట్ కార్డులను సెంట్రల్ ఎయిర్‌మెన్ సెలెక్షన్ బోర్డు (CASB) విడుదల చేసింది. ఈ పరీక్షకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ airmenselection.cdac.inను సందర్శించి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 12 జూలై నుంచి 18 జూలై వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ పరీక్ష ఆన్‌లైన్ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీ నుంచి 21వ తేదీల మధ్య జరగాల్సి ఉండగా... కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.
ఇక అభ్యర్థులు తమకు ఏ పరీక్షా కేంద్రం కేటాయించారో తెలుసుకునేందుకు వారి CASB పోర్టల్ పై వ్యక్తిగత వివరాలతో లాగిన్ అయి తెలుసుకోవాలని రిక్రూట్‌మెంట్ బోర్డు పేర్కొంది. ఇక పరీక్షకు 24 గంటల నుంచి 48 గంటల ముందు మాత్రమే అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుంటుందని రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది.
ఇక ఐఏఎఫ్ గ్రూప్ ఎక్స్ మరియు గ్రూప్ వై అడ్మిట్ కార్డు పొందేందుకు ఈ కింద స్టెప్స్‌ను ఫోలో అవ్వండి.

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: airmenselection.cdac.in
2. Candidate టాబ్‌కు వెళ్లండి. అక్కడ "Login for intake 01/22" పై క్లిక్ చేయండి
3. క్లిక్ చేసిన వెంటనే మరో పేజ్ ఓపెన్ అవుతుంది.
4. అభ్యర్థి తన ఈమెయిల్ ఐడీ పాస్‌వర్డ్‌తో క్యాప్షా టెక్ట్స్ ఎంటర్ చేయాలి.
5. ఇక కొన్ని క్షణాల్లోనే ఐఏఎఫ్ గ్రూప్ ఎక్స్ అండ్ వై అడ్మిట్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది.
6. అభ్యర్థి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
ఇక పరీక్ష రోజున ఫోటో ఐడీ ప్రూఫ్‌తో పాటు అడ్మిట్ కార్డు ప్రింట్ పరీక్ష అధికారులకు చూపించాల్సి ఉంటుంది. గ్రూప్ ఎక్స్ ఎగ్జామ్ రాసేవారికి ప్రశ్నలు ఇంగ్లీషు, ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి అడగడం జరుగుతుంది. సరైన సమాధానాలు ఇచ్చేందుకు గంట సమయం ఉంటుంది.
గ్రూప్ వై ఎగ్జామ్‌కు : 10+2 సీబీఎస్‌ఈ సిలబస్ ప్రకారం జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు 45 నిమిషాల సమయం ఉంటుంది. ఇక గ్రూప్ ఎక్స్ గ్రూప్ వై ట్రేడ్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రశ్నలు ఇంగ్లీషు, ఫిజిక్స్, మ్యాథ్స్‌తో పాటు జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు వీటికి సమాధానం ఇచ్చేందుకు 85 నిమిషాల సమయం ఇస్తున్నారు. ఇక ఒక్కో ప్రశ్నకు ఒక మార్కును కేటాయించారు.తప్పు సమాధానంకు 0.25 మార్కులు కోత విధిస్తారు.












Click it and Unblock the Notifications