Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CAT 2023: క్యాట్ స్కోర్ తో ఈ నాన్ ఐఐఎం విద్యాసంస్ధల్లోనూ చేరొచ్చు-ఇదిగో జాబితా..!

దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మేనేజ్ మెంట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్ 2023) పరీక్ష ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 11 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు సహా పద్నాలుగు మంది విద్యార్థులు 100 శాతం స్కోర్ సాధించారు. 29 మంది 99.99 పర్సంటైల్ సాధించారు. అలాగే మరో 29 మంది 99.98 పర్సంటైల్ సాధించారు. ఈ ఫలితాల్లో సాధించిన స్కోర్ల ఆధారంగా తదుపరి అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో మొదలుకాబోతోంది.

దీంతో క్యాట్ లో మెరుగైన స్కోరు సాధించిన అభ్యర్ధులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)లలో తదుపరి అడ్మిషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఆయా ఐఐఎంలు త్వరలో షార్ట్ లిస్ట్ లు విడుదల చేయబోతున్నాయి. అయితే ఐఐఎంలతో పాటు మరో 91 ఐఐఎంయేతర విద్యాసంస్థలు కూడా ఈ ఏడాది క్యాట్ 2023 స్కోర్‌లను తమ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి వాడుకుంటాయి.

CAT 2023: Here is a List Of Non-IIM Institutes Considering CAT Scores

అభ్యర్థులు క్యాట్ పరీక్షలో సాధించిన స్కోర్‌తో దరఖాస్తు చేసుకునేందుకు పలు ఐఐఎంయేతర సంస్థలు కూడా ఎదురుచూస్తున్నాయి. ఇలా క్యాట్ స్కోరుతో ఎంబీఏ సీట్లు ఆఫర్ చేస్తున్న సంస్ధలు అధికారిక వెబ్ సైట్ లో వాటి పేర్లు రిజిస్టర్ చేసుకున్నాయి. వీటి వివరాలను క్యాట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధుల కోసం అధికారిక వెబ్ సైట్లో ఉంచారు. దీని ప్రకారం ఆయా సంస్ధల వివరాలు ఇలా ఉన్నాయి.

నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (NPTI), బిట్స్ పిలానీ, IMI కోల్‌కతా, ఆచార్య బెంగళూరు బిజినెస్ స్కూల్ (ABBS), బెంగళూరు, జైపురియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, TAPMI, MDI గుర్గావ్, బిమ్‌టెక్, నోయిడా, MICA, నిర్మా యూనివర్సిటీ, అదానీ యూనివర్సిటీ బద్రుక, IIFT, IMS ఘజియాబాద్, IMT, IRMA, ITM, నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ,XIM విశ్వవిద్యాలయం, నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, SRM విశ్వవిద్యాలయం, GIBS-గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ స్కూల్, జిమ్స్, మేము స్కూల్, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఆసియా పసిఫిక్ DMI, ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అలయన్స్ యూనివర్సిటీ, సోమయ్య, SPJIMR, WOXSEN విశ్వవిద్యాలయం, విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వీటిలో ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+