Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CBSE Class 10 Result 2026: ముందుగానే టెన్త్ రిజల్ట్స్? డిజీ లాకర్ హింట్..!

కేంద్ర ప్రాథమిక విద్య బోర్డు (CBSE) ఈ ఏడాది నిర్వహించిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్ని (CBSE Class 10 Result 2026) ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఫలితాలు ముందుగా అనుకున్న దాని కంటే త్వరగానే విడుదలయ్యే సంకేతాలు వెలువడుతున్నాయి. పదో తరగతి ఫలితాలు అయితే ఏ క్షణాన అయినా విడుదలయ్యే ఛాన్స్ ఉందని డిజీ లాకర్ తాజాగా హింట్ ఇచ్చింది. దీంతో అభ్యర్ధుల్లో టెన్షన్ పెరుగుతోంది.

స్వల్ప నోటీసుతో త్వరలో సీబీఎస్ఈ పదవ తరగతి బోర్డు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీ తెలిపింది. 2026 మేలో జరగనున్న రెండవ దశ బోర్డు పరీక్షల కారణంగా పదవ తరగతి ఫలితాలు ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది దాదాపు 25 లక్షల మంది పదవ తరగతి అభ్యర్థులతో సహా, సుమారు 43 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

CBSE Class 10 Result 2026

ఇప్పటికే పూర్తయిన సీబీఎస్ఈ బోర్డు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా సాగింది. ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంతో 12వ తరగతికి గతంలో పట్టిన 12 రోజులతో పోలిస్తే ఈసారి మూల్యాంకన ప్రక్రియ తొమ్మిది రోజుల్లోనే పూర్తి అవుతుందని అంచనా. అయితే ఫలితాల విడుదలపై బోర్డు అధికారిక ప్రకటన మాత్రం ఇంకా చేయలేదు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి వారానికి ముందే పదవ తరగతి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని గతంలో తెలిపింది. అలాగే మే రెండవ వారం లోపు 12వ తరగతి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. గత సంవత్సరం, 10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాలు రెండూ మే 13న ప్రకటించారు. 10వ తరగతిలో ఒకటి లేదా రెండు మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వవచ్చు.

ఫలితాలను చూసుకునేందుకు అభ్యర్ధులకు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి.

results.cbse.nic.incbse.gov.inresults.nic.inresults.digilocker.gov.inumang.gov.incbse.nic.in

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+