CBSE: సీబీఎస్ఈ ప్రాక్టికల్స్- విద్యార్ధులు, స్కూళ్లకు బోర్డు కీలక సూచనలు-నో సెకండ్ ఛాన్స్..!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2023-24 సెషన్‌లో బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు, ఇంటర్నల్ అసెస్ మెంట్, ప్రాజెక్ట్ అసెస్ మెంట్ లకు సిద్ధమవుతున్న విద్యార్దులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులు వీటిని తప్పకుండా పాటించాలని బోర్డు సూచించింది. అలాగే ఈ పరీక్షలు నిర్వహించే పాఠశాలలకు సైతం బోర్డు పలు సూచనలు చేస్తోంది.
సీబీఎస్ఈ నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 1న ప్రారంభం కానున్నాయి. వీటి కోసం ల్యాబ్ ల ఏర్పాటు, స్టాక్స్, ఇంటర్నల్ అసెస్ మెంట్ చేసే ఎగ్జామినర్స్ ను అందుబాటులో ఉంచుకోవాలని స్కూళ్లకు బోర్డు సూచించింది. అలాగే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల జాబితాను ప్రచురించాలని, విద్యార్థులు సరైన లిస్ట్ లో ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలని స్కూళ్లకు సూచించింది.

పాఠశాలలు సరైన సబ్జెక్ట్‌లు, విద్యార్థుల వర్గం అంటే రెగ్యులర్/కంపార్ట్‌మెంట్/బెటర్ మెంట్ ఆన్‌లైన్ సిస్టమ్‌లో కనిపించేలా చూసుకోవాలని తెలిపింది.ప్రాక్టికల్ పరీక్షలకు మార్కులను ఇచ్చేటప్పుడు మార్కుల విభజన సర్క్యులర్‌లో పేర్కొన్న విధంగా సబ్జెక్ట్ ప్రాక్టికల్ కాంపోనెంట్‌లో సరైన గరిష్ట మార్కుల నుండి మాత్రమే నమోదు చేసేలా పాఠశాలలు నిర్ధారించుకోవాలని సీబీఎస్ఈ సూచించింది.
అలాగే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాలలు సమర్పించిన అభ్యర్థుల జాబితాలో తాము చదివిన సబ్జెక్టులు సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని బోర్డు సూచిస్తోంది.విద్యార్థులు, తల్లిదండ్రులు సిలబస్, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే సబ్జెక్టులపై అవగాహన కలిగి ఉండాలని, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావడానికి రెండో అవకాశం ఉండదని సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది. కాబట్టి విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాలని కోరుతోంది. అలాగే ప్రాక్టికల్స్ లో ఏదైనా సమస్య ఎదురైతే తాము చదివిన స్కూల్ ను సంప్రదించాలని సూచిస్తోంది.
మరోవైపు నిర్ణీత షెడ్యూల్‌లోగా అన్ని పాఠశాలలు ప్రాక్టికల్ పరీక్షలను పూర్తి చేసి మార్కులను వెబ్ సైట్లో అప్‌లోడ్ చేసేలా చూడాలని సీబీఎస్ఈ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది. ప్రాంతీయ కార్యాలయాలు అన్ని పాఠశాలల్లో తరగతి, సబ్జెక్టులలో వర్తించే చోట ప్రాక్టికల్ పరీక్షలను ప్రారంభించే ముందు బయటి నుంచి ఎగ్జామినర్‌లను నియమించినట్లు నిర్ధారించుకోవాలని బోర్డు తెలిపింది. ప్రాక్టికల్ పరీక్షల ప్రారంభానికి ముందు పాఠశాలకు ప్రాక్టికల్ జవాబు పుస్తకాలు అందజేసినట్లు ప్రాంతీయ కార్యాలయాలు నిర్ధారిస్తాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications