CBSE టెన్త్, ఇంటర్ - 2026 ఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్..!
దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 2026 సంవత్సరానికి సంబంధించిన... 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షల తుది షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఫిబ్రవరి 17, 2026 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 9 వరకు కొనసాగనున్నాయి. కాగా ఈ డేట్‌షీట్ ప్రకారం.. 10వ తరగతి పరీక్షలు మార్చి 10న ముగియనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9న పూర్తి కానున్నాయి.
ఈ పరీక్షలను రెండు షిఫ్టులలో నిర్వహించనుండగా.. మొదటి షిఫ్ట్ ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.. రెండవ షిఫ్ట్: ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. సబ్జెక్టు వ్యవధిని బట్టి ఈ సమయాల్లో మార్పులు ఉంటాయి. 10వ తరగతి పరీక్షలలో 50%, 12వ తరగతి పరీక్షలలో 40% ప్రశ్నలు కేస్ స్టడీ ఆధారిత, బహుళైచ్ఛిక ప్రశ్నలుగా ఉంటాయి. విద్యార్థులు పూర్తి షెడ్యూల్‌ను CBSE అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్షల షెడ్యూల్..
10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న గణితం (స్టాండర్డ్, బేసిక్) తో ప్రారంభమై, మార్చి 10న ఫ్రెంచ్ భాషతో ముగుస్తాయి. 12వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 17న బయోటెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, షార్ట్‌హ్యాండ్ (ఇంగ్లీష్, హిందీ) తో పరీక్షలు మొదలవుతాయి. ఏప్రిల్ 9న సంస్కృతం, డేటా సైన్స్, మల్టీమీడియాతో పరీక్షలు పూర్తవుతాయి.
డేట్‌షీట్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..?
- CBSE డేట్‌షీట్ 2026ను డౌన్‌లోడ్ చేయడానికి, విద్యార్థులు cbse.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో 'ఎగ్జామినేషన్' ట్యాబ్‌పై క్లిక్ చేసి, 'CBSE క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్ 2026' లేదా 'CBSE క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్ 2026' ఎంచుకోవాలి.
- డేట్‌షీట్ యొక్క PDF వెర్షన్‌ను చూడటానికి లింక్‌ను ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత షెడ్యూల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింటవుట్ తీసుకోవచ్చు.
ఇక జాతీయ విద్యా విధానం (NEP) 2020 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది పరీక్షా విధానంలో కొన్ని మార్పులు చేపట్టారు. 10వ తరగతి పరీక్షలలో 50%, 12వ తరగతి పరీక్షలలో 40% ప్రశ్నలు కేస్ స్టడీ ఆధారిత, బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQలు) తీసుకొచ్చారు. అలానే JEE మెయిన్, బోర్డు పరీక్షల మధ్య క్లాష్‌లను నివారించడానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థులు తమ 11వ తరగతి రిజిస్ట్రేషన్ నంబర్‌ను అందించాలని కోరింది. అర్హులైన విద్యార్థులకు ఈ రిజిస్ట్రేషన్ నంబర్‌ను అందించాలని పాఠశాలలకు సూచించారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications