తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోస్టులకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తేదీలివే
తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్ విభాగంలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పరీక్ష నిర్వహించి ఏప్రిల్ 6న ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సర్టిఫికేట్ వెరీఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అందుబాటులో ఉంచింది. హాల్ టికెట్ నెంబర్ల ఆధారంగా ఫలితాలు చూసుకోవచ్చు.
1:2 నిష్పత్తిలో ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 18, 19వ తేదీల్లో హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరికేషన్ నిర్వహించనున్నారు. దృవపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థుల అన్ని రకాల సర్టిఫికేట్లు, డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది.

అంతేగాక, అభ్యర్థులు ఏప్రిల్ 16 నుంచి 19 మధ్య వెబ్ ఆప్షన్లుు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియామకం ద్వారా మొత్తం 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వారి నుంచి 2023 జనవరి 10 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 16న కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించారు.
పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ మే 17న కమిషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 6న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. ఫిబ్రవరి 17న అభ్యర్థులు ర్యాంకులను ప్రకటించింది. తాజాగా, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications