సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా
టెన్త్ విద్యార్హతతో పారామిలిటరీ ఫోర్స్ లో పనిచేయాలని ఉందా..? అయితే మీకో గుడ్ న్యూస్. కేంద్ర హోం మంత్రిత్వశాఖ విభాగంలోని సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)లో కానిస్టేబుల్, డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మొత్తం 1124 కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. అర్హత కలిగిన పురుష అభ్యర్థులు టెన్త్ అర్హతతో.. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 1124
కానిస్టేబుల్/ డ్రైవర్: 845
(యూఆర్- 344, ఈడబ్ల్యూఎస్- 84, ఎస్సీ- 126, ఎస్టీ- 63, ఓబీసీ- 228)
కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్- ఆపరేటర్(DCPO) (డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీస్)- 279 పోస్టులు

(యూఆర్- 116, ఈడబ్ల్యూఎస్- 27, ఎస్సీ- 41, ఎస్టీ- 20, ఓబీసీ- 75)
అర్హత: టెన్త్ విద్యార్హతలతో పాటు.. డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ అనుభవం తప్పనిసరి కలిగి ఉండాలి.
వయోపరిమితి: 04.03.2025 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 167 సెం.మీ., ఛాతీ 80-85 సెం.మీ. ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.21,700-రూ.69,100.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
అప్లికేషన్ ఫీజ్ :
జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 03/02/2025.
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 04/03/2025.
అప్లికేషన్ విధానం ఇలా...
అప్లై చేసుకునే అభ్యర్థులు ముందుగా సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభించాలి. ఆ తర్వాత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తిచేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. రీసెంట్ ఫొటో, సైన్ వెబ్ సైట్లో పొందుపరచాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత అప్లికేషన్ ను క్లోజ్ చేయాలి.












Click it and Unblock the Notifications