TS: ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. తాజాగా, రాష్ట్ర పోలీసు నియామక మండలి మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోలీసు రవాణా విభాగం, అబ్కారీ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు శాఖల్లో కలిపి మొత్తంగా 677 పోస్టులను భర్తీ చేయనుంది.
ఎక్సైజ్ శాఖలో 614 కానిస్టేబుల్ పోస్టులు, ట్రాన్స్‌పోర్టు శాఖలో 63 కానిస్టేబుల్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మే 2 నుంచి 20 వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని నియామకమండలి స్పష్టం చేసింది. తదితర వివరాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.

పోలీసు శాఖతోపాటు ఎస్పీఎఫ్, ఫైర్, జైళ్ల శాఖలో 16,614 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు నాలుగు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇందులో 16,027 కానిస్టేబుల్ ఉద్యోగాలు కాగా, మిగతా 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
మరోవైపు, 503 గ్రూప్-1 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 18 శాఖలకు చెందిన పోస్టులను భర్తీ చేయనున్నట్టు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 42, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు-91, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్-48, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 పోస్టులు-41, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్-38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-40, ఎంపీడీవో పోస్టులు-121తో పాటు మరికొన్ని పోస్టులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications