ఈసీఐఎల్‌ - హైదరాబాద్‌ రిక్రూట్‌మెంట్‌ 2024.. అర్హ‌త‌లివే..!

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త ఈసీఐఎల్ హైద‌రాబాద్‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) జాబ్‌ నోటిఫికేషన్ ప్ర‌క‌టించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ జ‌ర‌గ‌నుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఈసీఐఎల్‌ ప్రాజెక్టు పనుల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీక‌రిస్తోంది.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు అప్లయ్ చేసుకునేందుకు ఏప్రిల్‌ 13 చివరితేదిగా నిర్ణ‌యించారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.ecil.co.in/ఈ వెబ్‌సైట్ ను సంప్ర‌దించొచ్చు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఈ ఉద్యోగాల‌కు ఎంపిక చేస్తారు.

ECIL - Hyderabad Recruitment 2024 Eligibility

ఇత‌ర వివ‌రాలు ఇలా ఉన్నాయి...

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు : మొత్తం 30
విభాగాల వారీ ఖాళీల వివ‌రాలు : ఈసీఈ- 5, ఈఈఈ- 7, మెకానికల్- 13, సీఎస్‌ఈ- 5 వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హ‌త : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై
ఉండాలి.
వ‌య‌సు : (13.04.2024 నాటికి) 27 సంవత్సరాలు మించకూడదు.
జీత‌భ‌త్యాలు : ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 - 1,40,000గా వేత‌నంగా ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఈ ఉద్యోగాల‌కు ఎంపిక
చేస్తారు.
దరఖాస్తు రుసుము వివ‌రాలు : యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 1000 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ,
ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏప్రిల్‌ 13, 2024 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణ‌యించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+