ఈసీఐఎల్ రిక్రూట్ మెంట్: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం, 9 పోస్టులు

ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 9 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో ఏడాది అనుభవం తప్పనిసరిగా ఉండాలని సూచించింది.

ECIL Recruitment 2021: Online Applications Invited for 9 New Vacancies

అభ్యర్థుల వయసు 31-10-2021 నాటికి 30 ఏళ్లు మించకూడదనే నిబంధన విధించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ముందుగా అకడమిక్‌ క్వాలిఫికేషన్‌ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ (వర్చువల్‌) ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 23,000 జీతంగా చెల్లిస్తారు. నవంబర్‌ 19, 2021 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్‌ 26, 2021 దరఖాస్తులకు చివరితేది పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ecil.co.in వెబ్ సైట్ చూడాలని కోరింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+