ఈఎస్ఐసీ రిక్రూట్‌మెంట్: 3800 పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC).. అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), స్టెనోగ్రాఫర్ (స్టెనో), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS)తో సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ESIC అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.inలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. వివిధ ప్రాంతాలలో 3,800 ఖాళీలు ప్రకటించబడ్డాయి.
ESIC రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీల సంఖ్య?
అప్పర్ డివిజన్ క్లర్క్: 1,700 పైగా ఖాళీలు.
స్టెనోగ్రాఫర్: 160కి పైగా ఖాళీలు.
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్: 1,930కి పైగా ఖాళీలు.

ESIC రిక్రూట్‌మెంట్ 2022: ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 15, 2022 నుంచి ప్రారంభమవుతుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 15, 2022.
ESIC రిక్రూట్‌మెంట్ 2022: ఎలా దరఖాస్తు చేయాలి?
రిజిస్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత, ఆసక్తిగల అభ్యర్థులు ESIC అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈఎస్ఐసీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
(https://www.esic.nic.in/recruitments/index/page:1)












Click it and Unblock the Notifications