GATE Admit Card 2024: గేట్ అడ్మిట్ కార్డుల విడుదల-చెక్ చేసుకోండిలా..!
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి అత్యుత్తమ విద్యాసంస్ధల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు, ఎంఈ, ఎంటెక్ వంటి పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సులు, లేదా విశ్లేషణ కోర్సులలో అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఏటా జాతీయ స్థాయిలో గేట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా గేట్ పరీక్ష నిర్వహణకు బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తమ వెబ్ సైట్ gate2024.iisc.ac.in లో ఈ అడ్మిట్ కార్డుల్ని విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2024 పరీక్ష ఫిబ్రవరి 3 నుంచి 11 మధ్య నిర్వహిస్తారు. ఐఐఎస్సీ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డును అభ్యర్ధులు కలర్ లో ప్రింట్ అవుట్ తీసుకోవాలి. గేట్ 2024 అడ్మిట్ కార్డ్‌తో పాటు, అభ్యర్థులు తప్పనిసరిగా సరైన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రాన్ని కూడా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. ఫోటో ఐడీ తప్పనిసరిగా ఆన్‌లైన్ దరఖాస్తును పూరించే సమయంలో పేర్కొన్న విధంగానే ఉండాలి.

భారతీయ అభ్యర్థుల కోసం ఆధార్ ఐడీ , పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ మరియు డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా గుర్తింపు కార్డులు ఆమోదిస్తారు. విదేశీ పౌరుల కోసం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, వారి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ మరియు డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష రాసేందుకు ఆమోదిస్తారు. గేట్ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్-15 మార్కులు, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్-13 మార్కులు, సబ్జెక్ట్ ప్రశ్నలు-72 మార్కులు కలిపి మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
గేట్ పరీక్షలో ప్రశ్నలకు 1 మార్కు లేదా 2 మార్కులు ఉంటాయి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల్లో ఎంచుకున్న తప్పు సమాధానానికి, నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక మార్కు ప్రశ్నలకు తప్పయితే 1/3 మార్కు కోల్పోతారు. 2 మార్కుల ప్రశ్నకు తప్పయితే 2/3 మార్కులు కోల్పోతారు. అయితే MSQ లేదా NAT ప్రశ్నలకు తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ లేదు.గేట్ అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న తేదీ మరియు సమయంలో అభ్యర్థి గేట్ పరీక్షా కేంద్రంలో హాజరు కావాలి. గేట్ అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న కేంద్రం లేదా స్థానం మరియు తేదీ మరియు సమయం మార్పు కోసం చేసే అభ్యర్ధలను స్వీకరించరు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications