GenZ: GenAIపై అతిగా ఆధారపడుతున్న GenZ నిపుణులు.. అప్‌గ్రాడ్ సర్వేలో కీలక విషయాలు అవుట్
Generative AI: ప్రస్తుత యువతరానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సామాజిక మాధ్యమాలు వంటి పదునైన సమాచార వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. విద్యనభ్యసించే రోజుల నుంచే ఉపాధ్యాయులపై పూర్తిగా ఆధారపడకుండా నెట్టింట దొరికే వివిధ రిసోర్సెస్‌ను రిఫర్ చేయడం మొదలుపెట్టారు. ఇదే పద్ధతిని GenZ (మిడ్ 1990- ఎర్లీ 2010 మధ్య జన్మించిన వారు) కిడ్స్ ఉద్యోగాల్లోనూ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన మూడున్నర వేల మంది GenZ నిపుణులు, వెయ్యికి పైగా HR లీడర్స్‌పై ఆన్‌లైన్ స్కిల్లింగ్ ప్లాట్‌ఫారమ్ అప్‌గ్రాడ్ ఓ పరిశోధన నిర్వహించింది. కార్పొరేట్ స్కిలింగ్ మరియు వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్ డివిజన్ అప్‌గ్రాడ్ ఎంటర్‌ప్రైజ్ వారి అభిప్రాయాల ఆధారంగా 'ది జెన్ ఏఐ గ్యాప్: జెన్‌జెడ్ & ది మోడరన్ వర్క్‌ప్లేస్' పేరిట ఓ నివేదికను రూపొందించింది. అందులో పలు కీలక విషయాలు వెలువడ్డాయి.

రాబోయే ఐదేళ్లకుగాను తమ కెరీర్ వృద్ధిలో జనరేటివ్ AI కీలక పాత్ర పోషిస్తుందని ప్రతి ఇద్దరిలో ఒక GenZ భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఉద్యోగ భద్రతపై కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ, 65 శాతం మంది GenAIపై ఆశావాద దృక్పథంతో తటస్థంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 77 శాతం మంది మాత్రం సాంకేతికతను కొత్త వృత్తిపరమైన అవకాశాలకు సూచనగా చూస్తున్నట్లు వెల్లడించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 56 శాతం మంది Gen Zలు తమ మేనేజర్‌ల కంటే GenAIని సంప్రదించడానికే ఎక్కువ ఇష్టపడతారట.
మరో 54 శాతం మంది Gen Z ప్రతివాదులు GenAIపై తమ ప్రస్తుత సంస్థాగత మార్గదర్శకాలు సరిపోవని విశ్వసిస్తున్నారు. కంపెనీలు స్పష్టమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విధానాలను మరియు సమగ్ర శిక్షణను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని వెల్లడిస్తున్నారు. ఇక 52 శాతం మంది తమ వర్క్‌ప్లేస్‌లో GenAI శిక్షణా కార్యక్రమాల గురించి స్పష్టత లేకపోవడాన్ని అంగీకరించారు. మరికొంతమంది అప్‌డేట్‌లు చాలా అరుదుగా లేదా అసలు అందుబాటులో లేవని హైలైట్ చేశారు.
75 శాతం GenZ నిపుణులు AI అవుట్‌పుట్‌లు సరైనవని మరియు సరిపోతాయని విశ్వసిస్తున్నారు. మరో 72 శాతం మంది AI రూపొందించిన సమాచారాన్ని యథాతథంగా ఉపయోగిస్తున్నట్లు అంగీకరించారు. అయితే AI వినియోగ సమాచారాన్ని బహిర్గతం చేసే విషయానికి వస్తే కేవలం 24 శాతం మంది మాత్రమే తమ AI వినియోగం గురించి సహోద్యోగులతో పంచుకోవడం సౌకర్యంగా ఉంటుందంటున్నారు. కానీ 25 శాతం మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications