నిరుద్యోగులకు తీపికబురు.. 71 వేల జీతంతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్‌. దేశంలోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 15 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 ఏప్రిల్ 25 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

ఎగ్జిక్యూటివ్ : 15 పోస్టులు. వీటిలోనే జనరల్ కేటగిరికి - 8. ఈడబ్ల్యూఎస్ - 1, ఓబీసీ - 3, ఎస్సీ - 2, ఎస్టీ - 1 గా నిర్ణయించారు.

విద్యార్హత..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు క్రింది కోర్సుల్లో కనీసం ఒకటి పూర్తి చేసి ఉండాలి. డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ డిగ్రీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి అదనపు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.

good-news-for-the-unemployed-ntpc-jobs-with-a-salary-of-71-thousand

ఎంపిక విధానం..

అభ్యర్థులను స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూలు ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్‌ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ లిస్టు రూపొందించబడుతుంది.

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 71,000 వేతనం లభిస్తుంది. ప్రభుత్వ సంస్థ కావడంతో అదనంగా ఇతర లాభాలూ ఉండే అవకాశం ఉంది.

దరఖాస్తుకు చివరి తేదీ..

ఏప్రిల్ 25, 2025

వయస్సు పరిమితి..

45 ఏళ్లు ఉండాలి. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు..

జనరల్/OBC/EWS: రూ. 300.. SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ..

దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. పూర్తి వివరాలకు NTPC అధికారిక వెబ్‌సైట్ https://ntpc.co.in/ సందర్శించండి. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసి ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+