నిరుద్యోగులకు తీపికబురు.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 జాబ్స్ !
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్. దేశభక్తితో కూడిన గౌరవప్రదమైన ఉద్యోగం.. మంచి వేతనం అందిస్తుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB). మొత్తంగా 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులందరికీ ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పొచ్చు.
దరఖాస్తు గడువు..
ఈ పోస్టులకు జులై 19, 2025 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆగస్టు 10, 2025 లోగా అధికారిక వెబ్‌సైట్ www.mha.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. ఫీజు చెల్లింపు చివరి తేదీ ఆగస్టు 12, 2025.

పోస్టుల కేటగిరీల వారీగా విభజన..
మొత్తం ఖాళీలు 3,717 కాగా, జనరల్ - 1,537, EWS - 442, ఓబీసీ - 946, ఎస్సీ - 566, ఎస్టీ - 226 పోస్టులు ఉన్నాయి. అన్ని కేటగిరీలలోని అభ్యర్థులు ఈ అవకాశం కోసం అప్లై చేయవచ్చు.
అర్హతలు..
ఈ పోస్టులకు అప్లై చేయాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేయాలి. దీనితో పాటు కంప్యూటర్ ఫండమెంటల్స్‌పై ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి..
అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ఠంగా 27 సంవత్సరాలు ఉండాలి. వయస్సును 10 ఆగస్టు 2025 నాటికి లెక్కిస్తారు. రిజర్వ్‌డ్ కేటగిరీలకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము వివరాలు..
జనరల్, OBC, EWS వర్గానికి చెందిన పురుష అభ్యర్థులు రూ.650 చెల్లించాలి. మిగతా వర్గాల అభ్యర్థులకు రూ.550 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు ఆగస్టు 12 వరకు చెల్లించొచ్చు.
ఎంపిక విధానం..
ఈ నియామక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతోంది.
TIER-I (Objective Test): జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ పై 100 మార్కుల పరీక్ష ఉంటుంది. సమయం 60 నిమిషాలు.
TIER-II (Descriptive Test): వ్యాసరచన (30 మార్కులు), ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ప్రెసిస్ రైటింగ్ (20 మార్కులు).
TIER-III (Interview): ఇంటర్వ్యూ దశ 100 మార్కులకు ఉంటుంది. మొత్తం మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం..
ఎంపికైన అభ్యర్థులకు లెవల్-7 పే స్కేల్‌లో ₹44,900 నుండి ₹1,42,400 వరకు జీతం లభిస్తుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అలవెన్సులు కూడా అందిస్తారు.
దరఖాస్తు విధానం..?
IB ACIO 2025 రిక్రూట్మెంట్‌కు దరఖాస్తు చేయాలనుకుంటే, ముందుగా అధికారిక వెబ్‌సైట్ అయిన www.mha.gov.in ని సందర్శించాలి. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోం పేజ్‌లో కనిపించే "IB ACIO Recruitment 2025" అనే లింక్‌ను క్లిక్ చేయాలి. అక్కడ కొత్తగా నమోదు (రిజిస్ట్రేషన్) చేసుకోవాలి. రిజిస్టర్ అయిన తర్వాత, లాగిన్ ఐడీ, పాస్ వార్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించాలి. వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, ఇతర వివరాలు తప్పులేదు అని బాగుగా తనిఖీ చేయాలి. ఫారమ్ పూరించిన తర్వాత, అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటో, సిగ్నేచర్ తదితర డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ప్రతి ఫైల్ నిర్ణీత ఫార్మాట్, సైజ్‌లో ఉండాలి. తర్వాత దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ మోడ్‌లో పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలి. అభ్యర్థి క్యాటగిరీకి అనుగుణంగా ఫీజు నిర్ణయించబడుతుంది. రుసుము చెల్లించిన తర్వాత, పూర్తి దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు సబ్మిట్ అయిన తర్వాత దాని ప్రింట్ అవుట్‌ను తీసుకొని భద్రంగా ఉంచుకోవాలి. ఇది ఫ్యూచర్ రిఫరెన్స్‌కు ఉపయోగపడుతుంది.
ఈ ఉద్యోగం గౌరవప్రదమైనదే కాకుండా దేశానికి సేవ చేసే అవకాశం కూడా అని భావించవచ్చు. ఆసక్తి గలవారు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications