Social Media Influencer: సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కావాలనుందా ? బాధ్యతలు, సంపాదన..
నేటి ఆధునిక కాలంలో యువత అంతా సోషల్ మీడియా చుట్టే తిరుగుతోంది. అంతే కాదు ఏ కంపెనీ అయినా, వ్యక్తులైనా, రాజకీయ పార్టీలైనా సోషల్ మీడియా ప్రమోషన్లపైనే ఆధారపడుతున్నారు. అలాంటి పరిస్దితుల్లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకూ డిమాండ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో వ్యక్తుల్ని, సంస్ధల్ని, ఉత్పత్తుల్ని ప్రభావవంతంగా ప్రమోట్ చేయడం ద్వారా వీరు ఇప్పుడు భారీగా అర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లుగా కెరీర్ లో స్ధిరపడాలనుకునే వారి కోసం ఈ కథనం..
నిర్ధిష్ట అంశాల్లో నిపుణులుగా ఉండే వారు ఆన్ లైన్ లో ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లుగా మారుతున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కు ఇప్పుడు దేశవ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ ఉంది. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వారు తమకు ఇష్టమైన కంటెంట్ ను వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై షేర్ చేయవచ్చు. ఈ కంటెంట్ పై వారి ఫాలోయర్‌లతో ఇంటరాక్ట్ కావచ్చు. ఇష్టమైన బ్రాండ్‌లతో భాగస్వామి కావచ్చు. వారు ఎక్కడి నుండైనా పని చేసే అవకాశం కూడా ఉంటుంది.

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లుగా పనిచేసే వారిపై చాలా మంది తమ వయస్సుతో సంబంధం లేకుండా ఎన్నో అంశాలపై ఆధారపడాల్సిన పరిస్దితి. అలాగే ప్రముఖ బ్రాండ్లన్నీ ఇన్ ఫ్లూయెన్సర్లపైనే ఆధారపడుతున్నాయి. తమ సోషల్ మీడియా ఖాతాల్లో నెటిజన్లను ప్రభావితం చేసి వారితో సదరు ఉత్పత్తుల్ని కొనేలా చూడటమే వీరి పని. వీరి సోషల్ మీడియా ప్రొఫైల్స్ వ్యక్తిగత బ్రాండింగ్, కంటెంట్, ప్రమోషన్‌లను కలిగి ఉంటాయి.
కంటెంట్ క్రియేటర్, ఇన్ ఫ్లూయెన్సర్ అనే రెండు పదాలు పరస్పరం పర్యాయపదాలుగా వాడేస్తున్నా వీటి మధ్య వ్యత్యాసం ఉంది. ఇందులో కంటెంట్ క్రియేటర్ అంటే దాన్ని తయారు చేసే వ్యక్తి. ఇన్ ఫ్లూయెన్సర్ అంటే దాన్ని ప్రచారం చేసే వ్యక్తి.
సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల బాధ్యతల్లో ముఖ్యమైనవి వారి కంటెంట్ భారీ సంఖ్యలో ప్రేక్షకులపై ప్రభావం చూపాల్సి ఉంటుంది. ఇందులో అన్ని వయస్సుల వారు, ముఖ్యంగా యువత ఉంటారు. కాబట్టి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ను పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బ్రాండ్ ప్రమోషన్లలో బ్రాండ్ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి.
సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు కావాలంటే ముందుగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి గ్రేడ్ 12లో కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, బ్రాండింగ్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ లేదా బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా చేసి ఉండాలి. 6-9 నెలల ఇంటర్న్‌షిప్ ఎక్స్ పీరియన్స్ కలిగి ఉండాలి. అప్పుడే ఫుల్ టైమ్ జాబ్స్ దొరుకుతాయి. సీఎన్బీసీ తాజా రిపోర్టు ప్రకారం మన దేశంలో ఇన్ ఫ్లూయెన్సర్ మార్కెట్ వచ్చే ఏడాది నాటికి రూ.2200 కోట్లకు చేరనుందని అంచనా.
ఇన్ ఫ్లూయెన్సర్ల జీతాలు వివిధ మార్కెటింగ్ ఏజెన్సీలు, వారి వ్యక్తిగత ఫాలోయర్ల ఆధారంగా ఉంటాయి. ఉదాహరణకు 1,000 నుండి 10,000 వరకు ఫాలోవర్లు ఉన్న వ్యక్తులను నానో ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా పరిగణిస్తారు. అయితే 10,000 నుండి 1 లక్ష మంది అనుచరులు ఉన్నవారు మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా పేర్కొంటారు. మాక్రో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు 1 లక్ష నుండి 1 మిలియన్ వరకు ఫాలోవర్లు కలిగి ఉంటారు. మెగా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగి ఉంటారు. వీరికి కనీసం 50 వేల నుంచి లక్షల్లో జీతాలు ఉంటాయి.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications