JEE main 2025 : జేఈఈ మెయిన్స్ ఓవరాల్ గా ఎలా ఉంది ? ఫీడ్ బ్యాక్ , కటాఫ్ ఇవే..!

జాతీయ స్దాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ సెషన్ 1 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో తొలి రోజు ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్ ల్లో బీఈ, బీటెక్ ప్రవేశాల కోసం అభ్యర్ధులు పేపర్ 1 పరీక్షలు రాశారు. తొలి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ జరిగింది. అయితే ఈ రెండు షిఫ్ట్ లలో జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాల స్థాయి ఎలా ఉందనే దానిపై అభ్యర్ధులు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.

నిన్న జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పేపర్ 1 పరీక్ష రాసిన అభ్యర్ధుల ఫీడ్ బ్యాక్ ప్రకారం చూస్తే ఓవరాల్ పరీక్ష మధ్యస్థం నుంచి కఠినంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మ్యాథ్య్ లో ప్రశ్నలు చాలా లెంగ్తీగా ఉన్నట్లు పరీక్ష రాసిన పలువురు అభ్యర్ధులు చెప్పారు. అలాగే ఫిజిక్స్ విభాగం మీడియం గానూ, కెమిస్ట్రీ విభాగం సులువుగానూ ఉన్నట్లు తెలిపారు. మ్యాథ్స్ పేపర్ లెంగ్తీగా ఉన్నా ప్రశ్నలు సులభంగానే ఉన్నట్లు పలువురు చెప్పారు. అలాగే షిఫ్ట్ ల వారీగా కూడా తమ అభిప్రాయాలు చెప్పారు.

How is JEE main 2025 session 1 exam overall here is candidates feedback cutoff paper analysis

షిఫ్ట్ 1 లో నిర్వహించిన పరీక్ష పేపర్ లో మ్యాథ్స్ లెంగ్తీగా ఉన్నా సులువుగా ఉందని చెప్పారు. ఫిజిక్స్ విభాగంలో ప్రశ్నలు మధ్యస్జంగా ఉన్నాయని, కెమిస్ట్రీ విభాగం సులువుగా ఉన్నాయని చెప్పారు. అలాగే షిఫ్ట్ 2లో చూస్తే.. మ్యాథ్స్ కష్టంగా ఉన్నాయని, కెమిస్ట్రీ సులువుగా ఉందని, ఫిజిక్స్ విభాగం సులువు నుంచి మధ్యస్థంగా ఉందని ఎక్కువ మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. అలాగే ఈ మూడు విభాగాల్లోనూ అడిగిన ప్రశ్నలు ఏయే ఛాప్టర్ల నుంచి వచ్చాయో కూడా వెల్లడించారు.

షిఫ్ 1 మ్యాథ్స్ లో ప్రాబబిలిటీ, మ్యాట్రిసెస్, ఆల్జీబ్రా, కాలిక్యులస్, వెక్టార్స్, కోఆర్డినేట్ జామెట్రీ, త్రీడీ నుంచి ప్రశ్నలు వచ్చాయి. అలాగే ఫిజిక్స్ లో మెకానిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, మోడరన్ ఫిజిక్స్, వేవ్స్ నుంచి ప్రశ్నలు ఇచ్చారు. కెమిస్ట్రీలో ఎలక్ట్రో కెమిస్ట్రీ, కైనెటిక్స్, పీ బ్లాక్, డీ బ్లాక్, ధర్మో డైనమిక్స్, బయో మాలిక్యూల్స్ నుంచి ప్రశ్నలు వచ్చాయి.

అలాగే షిఫ్ట్ 2 మ్యాథ్స్ లో హైపర్ బోలా, ఎక్ లిప్స్, ఏపీ, కోనిక్ సెక్షన్, కాంప్లెక్స్ నంబర్స్, ఏరియా అండర్ ద కర్వ్, మ్యాట్రిసెస్, సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి ఇచ్చారు. ఫిజిక్స్ లో లెన్స్, లాజిక్ గేట్, రే ఆప్టిక్, ఎలక్ట్రో స్టాటిక్, సెమీ కండక్టర్, ప్రొజెక్టైల్ మోషన్, యూనిట్స్ అండ్ డైమెన్షనల్స్, కైనెమెటిక్స్, ఫ్లూయిడ్, గ్రావిటేషన్ నుంచి ఇచ్చారు. కెమిస్ట్రీలో డైపోల్ మూమెంట్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, బయో మాలిక్యూల్స్, కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కాంపౌండ్, లోనిక్ ఈక్వెలిబ్రియం, పీ బ్లాక్, ధర్మో డైనమిక్స్ నుంచి ప్రశ్నలు ఇచ్చారు. అలాగే కటాఫ్ 110 నుంచి 130 ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కొన్ని కేంద్రాలలో, పరీక్ష చాలా కఠినంగా ఉంది మరియు అభ్యర్థులు రుమాలు ధరించడానికి లేదా ఎలాంటి ఆభరణాలు ధరించడానికి కూడా అనుమతించబడలేదు. జేఈఈ మెయిన్ 22 జనవరి షిఫ్ట్ 2 పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, షిఫ్ట్ 1 పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది.
ఈరోజు JEE మెయిన్ 2025 పరీక్ష ముగిసిన తర్వాత, 2025 సెషన్‌కు సమాధానాల కీలు మరియు పరిష్కారాలతో పాటు మెమరీ ఆధారిత ప్రశ్న పత్రాలు రెండు షిఫ్ట్‌లకు విడుదల చేయబడుతున్నాయి. ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు తమ JEE మెయిన్ 2025 ప్రశ్నాపత్రం పరిష్కారాలను మరియు నేటి పరీక్షకు సమాధానాల కీలను ప్రచురిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+