రాతపరీక్ష లేకుండా సౌత్ సెంట్రల్ రైల్వేలో భారీ ఉద్యోగాలు!
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో పదో తరగతి అర్హతతో పాటు ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ జారీ చేసింది. పలు ప్రదేశాలలో ఈ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమైంది.
సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు
ఇక ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయొచ్చు. విభాగాల వారీగా ఖాళీలు ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అంటే... ఈ ఉద్యోగాలకు కేటగిరీల వారీగా చూస్తే ఎస్సీ అభ్యర్థులకు 635 పోస్టులు, ఎస్టీ అభ్యర్థులకు 317 పోస్టులు, ఓబీసీ 1143, ఈడబ్ల్యూఎస్ 423, యుఆర్ 1714 చొప్పున ఉన్నాయి.

అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఎస్ సి ఆర్ వర్క్ షాప్ యూనిట్లలో 4,232 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో వచ్చే జిల్లాలలో నివసించే అభ్యర్థులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ ప్రాంతాలలో అప్రెంటీస్ షిప్
అర్హులైన అభ్యర్థులు జనవరి 27 2025వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. సికింద్రాబాద్, లాల్ గూడా, కాజీపేట, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్ట్ , కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్ ,ఒంగోలు ,రాయనపాడు, రాజమండ్రి , నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్ గిర్, నాందేడ్, పూర్ణ జంక్షన్, ముద్ ఖేడ్, మెట్టుగూడ తదితర ప్రాంతాలలో ఎస్సిఆర్ యూనిట్ ప్రదేశాలు ఉన్నాయి.
ఇక అప్రెంటిస్ ఖాళీలు వివరాలలోకి వెళితే
ఏసీ మెకానిక్ ఖాళీల సంఖ్య 143, ఎయిర్ కండిషన్ ఖాళీల సంఖ్య 32, కార్పెంటర్ ఖాళీల సంఖ్య 42 ,డీజిల్ మెకానిక్ ఖాళీల సంఖ్య 142, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఖాళీల సంఖ్య 85, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఖాళీల సంఖ్య 10, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రిషన్ ఖాళీల సంఖ్య 34, ట్రైన్ లైటింగ్ ఎలక్ట్రిషియన్ ఖాళీల సంఖ్య 34, ట్విట్టర్ ఖాళీల సంఖ్య 1742 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు, వయోపరిమితి ఇదే
మోటార్ మెకానిక్ వెహికల్ ఖాళీల సంఖ్య 8, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ ఖాళీల సంఖ్య 10, సంఖ్య 74 , వెల్డర్ ఖాళీల సంఖ్య 713, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత తో పాటు ట్రేడు లో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయో పరిమితి డిసెంబర్ 28 2024 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక మరిన్ని వివరాలకు సౌత్ సెంట్రల్ రైల్వే అఫీషియల్ సైట్ ను సందర్శించండి.












Click it and Unblock the Notifications