ఐబీపీఎస్ క్యాలెండర్ విడుదల: కీలక పరీక్షలు ఎప్పుడో తెలుసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS). బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల నియామక పరీక్షల క్యాలెండర్-2025ను విడుదల చేసింది. సాధారణ నియామకాల ప్రక్రియలో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్ నియామకాలు, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఉద్యోగ నియామకాలకు తేదీలను ప్రకటించింది.
పరీక్షల తేదీలను కూడా ప్రకటించినప్పటికీ.. ఆ సమయానికి స్వల్ప మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఐబీపీఎస్ క్యాలెండర్ ప్రకారం.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జులై 27, ఆగస్టు 2, 3 తేదీలలో జరగనున్నాయి రూరల్ బ్యాంక్స్ ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టు 30, సెప్టెంబర్ 6, 7, 2025 తేదీల్లో నిర్వహించనున్నారు.

మెయిన్ పరీక్ష ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 పరీక్షలు సెప్టెంబర్ 13న, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నవంబర్ 9న జరగనుంది. ఇక, ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో, మెయిన్ పరీక్ష నవంబర్ 29న నిర్వహించనున్నారు. ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్ష నవంబర్ 22, 23 తేదీల్లో, మెయిన్ పరీక్ష జనవరి 4, 2026న జరుగుతుంది.
ఐబీపీఎస్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 6, 7, 13, 14 తేదీల్లో, మెయిన్ పరీక్ష ఫిబ్రవరి 1, 2026న జరుగుతుంది. ఐబీపీఎస్ పరీక్షల నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే జరుగుతుంది. అన్ని పరీక్షలు ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష రెండింటికీ ఒకేసారి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications