Bank Jobs: 11 బ్యాంకుల్లో 5208 జాబ్స్..! డిగ్రీ అర్హత- పూర్తి వివరాలివే..!
దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్( ఐబీపీఎస్) తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా 11 బ్యాంకుల్లో రెండు కేటగిరీల ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రొబేషనరీ ఆఫీసర్లు, మేనేజ్‌మెంట్ ట్రైనీల ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే విధానం, ఇతర వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు.
11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు, మేనేజ్‌మెంట్ ట్రైనీల భర్తీ కోసం ఐబీపీఎస్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి దరఖాస్తు చేసుకునే వారికి డిగ్రీని కనీస విద్యార్హతగా నిర్ణయించారు. అలాగే అభ్యర్ధుల వయస్సు 2025 జూలై 1 తేదీ నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలని పేర్కొంది. రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు కూడా ఉన్నాయి. ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు జూలై 21 చివరి తేదీగా నిర్ణయించారు.

ఐబీపీఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ 5208 ఉద్యోగాల ఖాళీలు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో ఉన్నాయి. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ తో పాటు పూర్తి వివరాల కోసం అభ్యర్ధులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ https://www.ibps.in/లోకి ఎంటరై తెలుసుకోవచ్చు.












Click it and Unblock the Notifications