హైదరాబాద్ ఎన్ఐఎన్‌లో ఉద్యోగాలు: ఇంటర్వ్యూల ద్వారానే భర్తీ, నేరుగా హాజరుకావచ్చు
హైదరాబాద్: ఐసీఎంఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ భారత ప్రభుత్వరంగ భర్తీ చేయనున్న పోస్టులు, అర్హతలు, ఇతర వివరాలు తెలుసుకోండి.
ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 4 పోస్టులను భర్తీ చేయనుంది.
ప్రాజెక్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో
ప్రాజెక్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో
ప్రాజెక్ట్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితోపాటు సంబంధిత పనిలో అనుభవం, నెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 25-35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు రూ. 15,800- రూ. 44,450 వరకు చెల్లిస్తారు
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు లేకుండానే నేరుగా ఇంతర్వ్యూకు హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూకు అవసరమైన సర్టిఫికేట్లను తీసుకెళ్లాలి.
ఇంటర్వ్యూ ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది.
ఇంటర్వ్యూ అనంతరం ఉద్యోగంలో చేరే సమయంలో విద్యార్హత సర్టిఫికెట్‌లు ఒరిజినల్ చూపించాలి.
ప్రస్తుతం పని చేస్తున్నట్టయితే.. సంస్థ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 22, 2022
ఇంటర్వ్యూ వేదిక:
Conference hall,
ICMR-NIN,
Hyderaba, Telangana.
నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://www.nin.res.in/employement.html












Click it and Unblock the Notifications