India Post GDS 2026 2nd Merit List: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఖరారు..!
ఈ ఏడాది జవవరిలో దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో మూడు కేటగిరీల ఉద్యోగాల కోసం తపాలాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం పదో తరగతి విద్యార్హతతో ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాగ్ సేవక్ అనే మూడు కేటగిరీల ఉద్యోగాలున్నాయి. ఇవన్నీ కలిపి దేశవ్యాప్తంగా 28636 పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి పదో తరగతి మార్కుల ఆధారంగా ఇప్పటికే ఫస్ట్ మెరిట్ లిస్ట్ గత నెలలో విడుదలైంది.
ఇప్పుడు రెండో మెరిట్ లిస్ట్ (India Post GDS 2026 2nd Merit List) కోసం అభ్యర్ధులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో మెరిట్ లిస్ట్ పై అప్డేట్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ మెరిస్ట్ లిస్ట్ లో ఎంపికైన అభ్యర్ధుల నుంచి డాక్యుమెంట్లు తీసుకుని పరిశీలించే ప్రక్రియ గత నెల 23న ముగిసింది. దీంతో ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలకు ఎంపికై చేరని వారు, డాక్యుమెంట్ల పరిశీలనకు రాని వారిని తప్పించి రెండో మెరిట్ లిస్ట్ ను తయారు చేశారు. ఈ లిస్ట్ విడుదలకు రంగం సిద్దమవుతోంది. ఈ లిస్ట్ విడుదల కాగానే అధికారిక వెబ్ సైట్ https://indiapost.gov.in/gdsonlineengagement లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

వచ్చే వారం పోస్టల్ ఉద్యోగాలకు రెండో మెరిట్ లిస్ట్ విడుదల చేసేందుకు తపాలాశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే తయారైన ఈ జాబితాను వెబ్ సైట్లో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులోనూ ఫస్ట్ మెరిట్ లిస్ట్ తరహాలోనే పదో తరగతిలో కాస్త అటు ఇటుగా 90-100 మార్కుల మధ్య సాధించిన వారికే ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలో ఈ రెండో మెరిట్ లిస్ట్ విడుదలయ్యాక గతంలో చేసినట్లుగానే డాక్యుమెంట్ల సమర్పణ, పరిశీలనకు టైం ఇస్తారు. అప్పటికీ ఇంకా ఖాళీలు మిగిలితే మరో మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేస్తారు. దీంతో ఎంపిక కాని అభ్యర్ధులు చివరి మెరిట్ లిస్ట్ వరకూ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు.












Click it and Unblock the Notifications