India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!
కేవలం పదో తరగతి అర్హతతో ఎలాంటి పరీక్షలు లేకుండా దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో 28 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం తపాలాశాఖ (India Post) ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం తాజాగా మెరిట్ లిస్ట్ ను ఆన్ లైన్ లో తయారు చేసి విడుదల చేసింది. దీని ప్రకారం తొలి విడతలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఉద్యోగాలు పొందిన వారు తమ సర్టిఫికెట్ల పరిశీలన కోసం తపాలా శాఖ ఈ నెల 23 వరకూ గడువు ఇచ్చింది.
ఇది పూర్తయ్యాక ఇంకా భర్తీ కాని ఉద్యోగాల కోసం రెండో మెరిట్ లిస్ట్ విడుదల చేయబోతోంది. ఈ నెల 23 నుంచి 25 లోపు ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ (India Post GDS 2nd Merit List 2026) విడుదలయ్యే అవకాశం ఉందని తపాలాశాఖ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కాగానే మిగిలిన ఉద్యోగాల వివరాలను తపాలాశాఖ వెల్లడించే అవకాశం ఉంది. దాని ప్రకారం సెకండ్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. అప్పుడు మళ్లీ కటాఫ్ ల ఆధారంగా ఈ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ తేదీల్లో ఏమైనా ఆలస్యం జరిగితే మాత్రం ఏప్రిల్ మొదటివారం కల్లా ఈ మెరిట్ లిస్ట్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.

తపాలా శాఖ భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం), గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 28636 ఉద్యోగాలను ఇందులో భర్తీ చేస్తున్నారు. తొలి మెరిట్ లిస్ట్ లో ఎంపికైన అభ్యర్ధుల సర్టిఫికెట్లలో ఏదైనా తేడా ఉన్నా లేక ఎంపికైన అభ్యర్ధులు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేందుకు ఇష్టపడకపోయినా సదరు ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటాయి. వీటిని సెకండ్ మెరిట్ లిస్ట్ లో భర్తీ చేయనున్నారు. అప్పటికీ భర్తీ కాకపోతే మూడో మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేస్తారు. ఇలా ఉద్యోగాలన్నీ భర్తీ అయ్యే వరకూ ఈ మెరిట్ లిస్ట్ ల విడుదల కొనసాగబోతోంది.












Click it and Unblock the Notifications