ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీ జీతంతో ఉద్యోగాలు.. మరో రెండు రోజులే గడువు !!
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 455 సెక్యూరిటీ అసిస్టెంట్/జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. కేంద్రప్రభుత్వ రంగంలో ఉద్యోగంతో పాటు.. మంచి వేతనం పొందాలి అనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారు సెప్టెంబర్ 28లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు..
455
పోస్టులు..
సెక్యూరిటీ అసిస్టెంట్/జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
విద్యార్హతలు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలానే వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

వయస్సు పరిమితి..
- అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.
- OBC అభ్యర్థులకు - 3 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు - 5 సంవత్సరాలు
- దివ్యాంగులకు - 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం..
- వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్/డెస్క్రిప్టివ్)
- డ్రైవింగ్ స్కిల్ టెస్ట్
- ఇంటర్వ్యూ/వ్యక్తిగత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ప్రతిభను బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
జీతం..
- సెలెక్ట్ అయిన వారికి 7వ వేతన కమిషన్ ప్రకారం జీతం ఉంటుంది.
- ప్రాథమిక వేతనం: రూ.21,700 - రూ.69,100 నెలకు
- అదనంగా అలవెన్సులు (DA, HRA, TA) లభిస్తాయి.
- ప్రభుత్వ ఉద్యోగులకు అందే అన్ని రకాల ప్రయోజనాలు, పెన్షన్ సౌకర్యాలు ఉంటాయి.
దరఖాస్తు గడువు..
- సెప్టెంబర్ 6, 2025 నుంచి సెప్టెంబర్ 28, 2025 వరకు
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్స్, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్: https://गृहमंत्रालय.सरकार.भारत/en చెక్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications