Inter Hall Ticket 2024 : నేడే టిఎస్ ఇంట‌ర్మీడియ‌ట్ హాల్‌టికెట్లు విడుద‌ల‌...

ఫిబ్ర‌వ‌రి 28, 2024 నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ ప‌రీక్ష‌లు మార్చి 19 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్పటికే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ఈ ప్రకారమే ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నుంది తెలంగాణ విద్యాశాఖ‌. ఇక‌, ఇప్పటికే తెలంగాణ ఇంటర్‌మీడియ‌ట్‌ పరీక్షల షెడ్యూల్‌ను సైతం ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్న నేప‌థ్యంలో ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లను నేడు అంటే సోమవారం (ఫిబ్రవరి 19) విడుదలయ్యే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయ‌డం జరుగుతుంది. విద్యార్థులు ఈ tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు. ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులు ఈఎస్ఎస్ఎస్ సి లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తో థియరీ పరీక్ష హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు.

ఇంట‌ర్ ద్వితియ సంవ‌త్స‌రం విద్యార్థులు, మొద‌టి సంవ‌త్స‌రం హాల్ టికెట్ లేదా సెకండియర్ హాల్ టికెట్ నెంబర్ తో హాల్ టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు. హాల్ టికెట్లో ఏవైనా తప్పులు దొర్లినట్లయితే, ఫోటో తప్పుగా పడడం, సంతకాలు, ఇతర వివరాలు ఏవైనా తప్పుగా పడినట్లయితే క‌ళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని క‌ల్పించారు.
ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు (జనరల్‌/వొకేషనల్‌ కోర్సులు) ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు జ‌రిగిన విషయం తెలిసిందే. రెండో శనివారం, ఆదివారాల్లోనూ ఈ పరీక్షలను నిర్వ‌హించారు. రెండు సెషన్లలో అంటే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్‌ పరీక్షలు జ‌రిగాయి.

Inter Hall Ticket 2024 : Today TS Intermediate Hall Tickets release...

9.8 లక్షల మంది ఇంట‌ర్ విద్యార్థులు...

తెలంగాణలో ఇంట‌ర్‌మీడియ‌ట్ వార్షిక పరీక్షలు ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం...ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. పరీక్షా సమయం ప్రతిరోజు ఉదయం 9 నుండి, మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్న‌ట్లు స‌మాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+