JEE Main 2024 admit card : జేఈఈ మెయిన్ 2024 అడ్మిన్ కార్డుల విడుదల-డౌన్ లోడ్ ఇలా..!

జేఈఈ మెయిన్ పరీక్ష 2024 సెషన్ 1 కు సంబంధించిన అడ్మిట్ కార్డులు (JEE Main 2024 admit card) ఇవాళ విడుదలవుతున్నాయి. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)వీటిని విడుదల చేస్తోంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గా పేర్కొనే జేఈఈ సెషన్ 1 షెడ్యూల్ ప్రకారం పరీక్ష జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించాలని ఎన్టీఏ ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఇప్పుడు అడ్మిట్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.

JEE మెయిన్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ గతేడాది నవంబర్ 1న ప్రారంభమై నవంబర్ 30న ముగిసింది. డిసెంబర్ 8 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులకు సవరణలు చేసుకోవడానికి అనుమతించారు. ఇవాళ అడ్మిట్ కార్డుల్ని విడుదల చేస్తున్నారు. NTA అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసిన తర్వాత, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను jeemain.nta.ac.inని సందర్శించవచ్చు. ఇందులో నుంచి అభ్యర్ధులు అడ్మిట్ కార్డ్‌లను తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

JEE Main admit card 2024 for Session 1 to be released today- here is how to download...

JEE మెయిన్ 2024 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా ?

1. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ‌ను ఓపెన్ చేయాలి.

2. హోమ్‌పేజీలో JEE మెయిన్ 2024 అడ్మిట్ కార్డ్ (లింక్ యాక్టివ్ అయిన తర్వాత) అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.

3. స్క్రీన్‌పై కొత్త పేజీ కనిపిస్తుంది.

4. అడిగిన ఆధారాలను నమోదు చేసి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.

5. అనంతరం అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

6. ఇక్కడ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.

మరిన్ని అప్‌డేట్‌ల కోసం, అభ్యర్థులు JEE మెయిన్స్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

జేఈఈ మెయిన్ 2024 సెషన్ పరీక్ష జనవరి 24న బీఆర్క్, బీప్లానింగ్ పేపర్ తో మొదలు కానుంది. అనంతరం బీఈ, బీటెక్ పేపర్లకు జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. JEE (మెయిన్) 2024 పరీక్షను మొత్తం 13 భాషలలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ ఉన్నాయి. అభ్యర్ధులు ఎంచుకున్న మీడియం ఆధారంగా పరీక్షా పత్రాలు అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+