JEE Main paper 2 results: నేడు జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాల విడుదల-స్కోర్ కార్డు ఇలా..!
జేఈఈ బీఆర్క్, బీ-ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది జనవరి 24న జేఈఈ మెయిన్ పేపర్ 2 పరీక్షలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఎన్టీఏ సిద్ధమవుతోంది. ఇవాళ ఫలితాలను ప్రకటించే అవకాశముంది. దీంతో అభ్యర్ధులు ఫలితాలు తెలుసుకునేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలో ఓసారి చూద్దాం..
ఈ ఏడాది జేఈఈ మెయిన్ పేపర్ 2 పరీక్ష రాసిన అభ్యర్ధులు.. వారి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి JEE మెయిన్ బీఆర్క్ స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. స్కోర్ కార్డుల్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు అభ్యర్ధులు ఈ కింద పాటించిన నిబంధనల్ని అనుసరించాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా అభ్యర్ధులు JEE మెయిన్ 2024 అధికారిక వెబ్‌సైట్ - jeemain.nta.ac.inను సందర్శించాలి.

హోమ్‌పేజీ పైన అందుబాటులో ఉన్న JEE మెయిన్ 2024 సెషన్ 1 పేపర్ 2 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ జేఈఈ మెయిన్ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ (స్క్రీన్ పై కనిపిస్తుంది) నమోదు చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు జనవరి సెషన్‌కు సంబంధించిన జేఈఈ మెయిన్ పేపర్ 2 స్కోర్‌కార్డ్ 2024 కనిపిస్తుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications