JEE Mains 2024: జేఈఈ మెయిన్స్ సెషన్ 1 సిటీ స్లిప్పుల విడుదల-డౌన్ లోడ్ ఇలా..!

ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ (JEE Mains 2024) సెషన్ 1 పరీక్షకు సంబంధించి జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఇవాళ సిటీ స్లిప్లులు విడుదల చేసింది. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి అడ్మిట్ కార్డుల రిలీజ్, సిటీ స్లిప్పుల రిలీజ్ కు ఇప్పటికే ఏర్పాట్లు చేసిన ఎన్టీఏ.. ఇవాళ బీఆర్క్ లేదా బీప్లానింగ్ పరీక్షకు సంబంధించిన స్లిప్పుల్ని మాత్రం విడుదల చేసింది.

జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 1 బీఆర్క్ పరీక్షకు సంబంధించిన సిటీ స్లిప్పుల్ని అధికారిక వెబ్ సైట్ లో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇప్పటికే విడుదల చేసిన ఎగ్జామ్ నోటీసులో జనవరి రెండో వారంలో వీటిని విడుదల చేస్తామని వెల్లడించిన ఎన్టీఏ.. అన్నట్లుగానే ఇవాళ వీటిని వెబ్ సైట్ లో పెట్టింది. జేఈఈ వెబ్ సైట్ jeemain.nta.ac.in నుండి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

JEE Mains 2024: Session 1 exam city slip out for BArch/BPlanning- here is how to download

జేఈఈ మెయిన్స్ 2024కు సంబంధించిన సిటీ స్లిప్లుల్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు ముందుగా అధికారిక వెబ్ సైట్ jeemain.nta.ac.in లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో అప్లికేషన్ నంబర్ తో పాటు పుట్టిన తేదీని ఎంటర్ చేసి సిటీ స్లిప్పును డౌన్ లోడ్ చేసుకోవచ్చని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ సిటీ స్లిపుల్లో అభ్యర్ధులు జేఈఈ పరీక్షా కేంద్రాలు ఉన్న నగరాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఇందులో పరీక్ష తేదీ , షిఫ్ట్ టైమింగ్, రిపోర్టింగ్ సమయం , పరీక్ష రోజు
పాటించాల్సిన మార్గదర్శకాలు, ఇతర సమాచారం ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+