రాతపరీక్ష లేకుండానే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు..అప్లయ్ చేసుకోండి..!
నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ బరోడా 459 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గుజరాత్ రాష్ట్రం వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖల్లో వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్య్వూ, ఇతర పరీక్షల ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా, సీఏ/ సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 459.
ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలివే..
సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, గ్రూప్ హెడ్, టెరిటరీ హెడ్, ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్‌ఎంఈ, జోనల్ సేల్స్ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, సీనియర్ డెవలపర్ తదితరాలు.

దరఖాస్తు ఫీజు వివరాలు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులయితే రూ.100 చెల్లించాలి. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చేనెల రెండో తేది (02.07.2024) చివరితేదిగా నిర్ణయించడమైనది.












Click it and Unblock the Notifications