Post Office Jobs: టెన్త్ పాస్ తో 28 వేల పోస్టల్ జాబ్స్-30వేల జీతం-ఇవాళే లాస్ట్..!
తెలుగు రాష్ట్రాల్లోని పోస్టాఫీసుల్లో (india post) కేవలం పదో తరగతి ఉద్యోగంతో, ఎలాంటి పరీక్ష కూడా లేకుండా లభించే 28 వేలకు పైగా ఉద్యోగాల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి దశకు చేరుకుంది. ఇవాళే దరఖాస్తులకు ఆఖరు తేదీ. కాబట్టి ఇంకా దరఖాస్తు చేయని వారు ఎవరైనా ఉంటే మరికొన్ని గంటల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఇప్పటికే చేస్తున్న దరఖాస్తుల్లో ఏవైనా పొరబాట్లు చేసి ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పిస్తారు. అనంతరం ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.
పోస్టాఫీసుల్లో 3 రకాల ఉద్యోగాలు,జీతం (inda post)
పోస్టాఫీసుల్లో గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) ఉద్యోగాలు అన్నీ కలిపి 28636 ఉన్నాయి. ఇందులో ఏఫీకి 1060, తెలంగాణకు 608 పోస్టులు కేటాయించారు. వీటిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి రూ.12 వేల నుంచి మొదలుపెట్టి గరిష్టంగా రూ.29,380 వరకూ జీతంగా చెల్లిస్తారు. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా జీడీఎస్ ఉద్యోగానికి రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.24,270 వరకూ జీతంగా చెల్లిస్తారు. ఏటా 3 శాతం జీతాల పెంపు ఉంటుంది.

అర్హతలు ఇవే
18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే ఈ ఉద్యోగాలకు ఆటోమేటిగ్గా ఎంపిక చేస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు రిజర్వేషన్లు కూడా ఉంటాయి. పదో తరగతి మార్క్స్ షీట్, ఐడీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికెట్, దివ్యాంగ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇలా అవసరమైన అన్నీ సమర్పించి ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు, ఎంపికలు ఇలా
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సిన వారు నేరుగా https://indiapost.gov.in/gdsonlineengagementలింక్ ను క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే దరఖాస్తులకు సమయం ఉంది. అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారికి ఈ నెల 18, 19 తేదీల్లో ఆన్ లైన్ లో దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తారు. అనంతరం ఈ నెల 28న ఎంపికైన వారికి ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఆ తర్వాత వారు ఫిజికల్ గా సర్టిఫికెట్లు సమర్పించి తమ ఉద్యోగాలు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications