తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో తప్పులు..షార్ట్‌ఫాల్ విధానంతో మెయిన్స్ అర్హుల సంఖ్య పెంపు..
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫలితాలతో పాటు తుది కీను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరించింది. ఈ తుది కీలో కొన్ని తప్పులు దొర్లాయని గ్రూప్-1 అభ్యర్థులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రాథమిక కీలో ఐదు తప్పులు దొర్లయాని అభ్యర్థులు ఆరోపించారు. తప్పులు వచ్చినా వాటిని టీజీపీఎస్సీ అధికారులు సరిచేసినట్టుగా లేదని, వాటిని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని గ్రూప్ 1 అభ్యర్థులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని గ్రూప్ 1 అభ్యర్థులు దేవేందర్, రాకేశ్ తదితరులు తెలిపారు.

షార్ట్‌ఫాల్ విధానం...
రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం గతంలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు గాను గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9వ తేదిన రాష్ట్రంలోని 31 జిల్లాల్లో జరిగింది. ఈ పరీక్షలో 1:50 నిష్పత్తి ప్రకారమే టీజీపీఎస్‌సీ అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేశారు. ఈ నిష్పత్తి ప్రకారం చూసుకుంటే మొత్తం 28,150 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు. యితే ఈసారి గ్రూప్ 1 పరీక్షలో షార్ట్‌ఫాల్ విధానం అమలు చేశారు.
దీంతో మెయిన్స్‌కు హాజరయ్యేవారి సంఖ్య 31,382 మందికి చేరుకుంటుంది అంటే, అదనంగా 3,232 మందిని ఎంపిక చేశారు. 1:57 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ రాసేందుకు ఎంపిక చేసినట్లు టీజీపీఎస్‌సి అధికారులు చెబుతున్నారు. ఇక, గ్రూప్ 1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ల నెంబర్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసిన కమిషన్ ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్ మార్కుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవని, ముందుగా ప్రకటించినా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21 నుంచి 27 వరకు పరీక్షలు ఉంటాయని కమిషన్ పేర్కొంది. మెయిన్స్ పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి అడ్మిట్ కార్డులను విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ తెలిపింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications