నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు: 1664 అప్రెంటిస్ పోస్టులు..అర్హతలు ఇవే..!!

రైల్వేలో ఉద్యోగం పొందాలనుకునే వారికి గుడ్ న్యూస్. నార్త్ సెంట్రల్ రైల్వేస్ 1664 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 1 సెప్టెంబర్ 2021. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

నార్త్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలకు విద్యార్హతలు అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల వయస్సు కనీసం 15 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 28 ఏళ్లు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు మినహాయింపు ఉంటుంది.

North Central railway recruitment 2021: Apply for 1664 Apprentice jobs

ఇక అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసే ప్రక్రియ ఆగష్టు 2వ తేదీన ప్రారంభమైంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 1 సెప్టెంబర్ 2021. ఇక ఫీజు వివరాలకు వస్తే జనరల్ / ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులైన అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.

ఇక అప్లికేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఎంపిక అయిన అభ్యర్థులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులను మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆయా ట్రేడ్‌లో వచ్చిన మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఆపై మిగతా నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ను పూర్తి చేశాక ఒక ప్రింట్ కాపీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా డౌన్‌లోడ్ చేసుకుని ఉంచుకోవాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://ncr.indianrailways.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+