భారీ జీతంతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్ డేట్ !
నిరుద్యోగ అభ్యర్థులకు ఇండియన్ నేవీ తీపికబురు ప్రకటించింది. స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.63,200 వరకు జీతం ఉంటుంది. ఈరోజుతో అప్లై చేసుకోవడానికి గడువు ముగియనుంది. ఇంకా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకొని వారు ఉంటే త్వరపడి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు..
ఇండియన్ నేవీలో మొత్తం 1315 స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాగా స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ (రెగ్యులర్) 1266 పోస్టులు.. స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ (బ్యాక్‌లాగ్) 49 పోస్టులు ఈ మేరకు భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు..
ఈ ఉద్యోగాలకు 10వ తరగతి (SSC) పాస్ అవ్వాలి. అదనంగా ITI పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత ట్రేడ్‌లో అనుభవం ఉంటే అదనపు ప్రాధాన్యం లభిస్తుంది.
జీతం..
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం లభిస్తుంది. అంతే కాకుండా అదనంగా ప్రభుత్వ ఉద్యోగ భద్రత, పెన్షన్, మెడికల్, ట్రావెల్ అలవెన్స్, ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి.
వయస్సు..
కనీస వయస్సు: 18 ఏళ్లు
గరిష్ట వయస్సు: 25 ఏళ్లు
OBCలకు 3 ఏళ్ల సడలింపు
SC/STలకు 5 ఏళ్ల సడలింపు
దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు
దరఖాస్తు గడువు..
2025 ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 2, 2025
దరఖాస్తు విధానం..
ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ https://indiannavy.gov.in/ ను సందర్శించి నోటిఫికేషన్‌లో ఇచ్చిన సూచనలు ఫాలో అనుసరించాలి. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, మ్యాథ్స్, ట్రేడ్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. ట్రేడ్ టెస్ట్‌లో ప్రాక్టికల్ నైపుణ్యాలను అంచనా వేస్తారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications