డిగ్రీ అర్హత ఉంటే చాలు.. రూ.85,920 జీతంతో ఉద్యోగాలు !
డిగ్రీ పాసై ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మంచి వేతనంతో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
మొత్తం ఖాళీలు..
750
పోస్టు..
లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (Local Bank Officer)
దరఖాస్తు గడువు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 2025 ఆగస్టు 20 నుంచి 2025 సెప్టెంబర్ 4 వరకు

పరీక్ష తేదీ..
త్వరలో ప్రకటించనున్నారు.
విద్యార్హత..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి.
వయస్సు పరిమితి..
కనీసం: 20 సంవత్సరాలు
గరిష్టం: 30 సంవత్సరాలు
సడలింపు:
OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
దివ్యాంగులకు: 10 సంవత్సరాలు
ఎక్స్ సర్వీస్ మెన్: 5 సంవత్సరాలు
ఎంపిక విధానం..
అభ్యర్థులను పలు దశలలో ఎంపిక చేస్తారు:
ఆన్‌లైన్ రాత పరీక్ష
స్క్రీనింగ్ టెస్ట్
పర్సనల్ ఇంటర్వ్యూ
ఫైనల్ మెరిట్ లిస్ట్
లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (తమ ప్రాంత భాషపై అవగాహన పరీక్షిస్తారు)
పరీక్ష హిందీ & ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు..
జనరల్, EWS, OBC అభ్యర్థులు: ₹850
SC, ST, PWD అభ్యర్థులు: ₹100
వేతన వివరాలు..
ప్రారంభ వేతనం: రూ.48,480
పే స్కేల్: రూ.48,480 - రూ.85,920
అదనంగా HRA, DA, మేడికల్, లీవ్ ట్రావెల్ అలవెన్స్ వంటి సదుపాయాలు లభిస్తాయి.
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ punjabandsindbank.co.in లో అప్లై చేసుకోవాలి. "Recruitment" సెక్షన్‌లోకి వెళ్లి Local Bank Officer 2025 Notification ఎంపిక చేయాలి. కొత్తగా నమోదు చేసుకుని, ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫారమ్ పూరించాలి. అవసరమైన డాక్యుమెంట్స్ (ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు) అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
సూచనలు..
అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేయాలి.
తప్పు సమాచారం ఇస్తే అప్లికేషన్ రద్దు అవుతుంది.
ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఏ బ్రాంచ్‌కైనా పోస్టింగ్ పొందవచ్చు.












Click it and Unblock the Notifications