PNB SO : పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్...1025 పోస్టులు...
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు చక్కని అవకాశం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 25 చివరి తేదిగా పరిగణించడమైనది.
ఇతర వివరాలు...
వయసు : 01.01.2024 నాటికి ఆఫీసర్ పోస్టులకు 21-28 ఏళ్లు, మేనేజర్ పోస్టులకు 25-35 ఏళ్లు ఉండాలి. సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య ఉండాలి.
శాలరీ : ఆఫీసర్‌కు నెలకు రూ.36,000-రూ.63,840 ఉంటుంది. మేనేజర్‌కు రూ.48,170-రూ.69,810 ఉంటుంది. సీనియర్ మేనేజర్‌కు రూ.63,840-రూ.78,230గా ఉంటుంది.
ఎంపిక చేయు విధానం : ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
విద్యార్హత: ఖాళీలను అనుసరించి బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.590, మిగతా అభ్యర్థులకు రూ.1180గా నిర్ణయించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, వైజాగ్, హైదరాబాద్.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం : రాత పరీక్షకు సంబంధించి పార్ట్-1లో రీజనింగ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు).. పార్ట్-2లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ (50 ప్రశ్నలు- 100 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు.

మొత్తం పోస్టులు -1025
ఆఫీసర్-క్రెడిట్ (జేఎంజీ స్కేల్-I): 1000 పోస్టులు
మేనేజర్-ఫారెక్స్ (ఎంఎంజీ స్కేల్-II): 15 పోస్టులు
మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-II): 05 పోస్టులు
సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-III): 05 పోస్టులు
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం: ఫిబ్రవరి 7, 2024
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2024
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి/ ఏప్రిల్ 2024 ఉంటుంది.
పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ https://www.pnbindia.in/ను సంప్రదించగలరు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications