RBIలో ఉద్యోగాలు: 10 పాసయ్యారా.. మంచి జీతంతో ఉద్యోగం..వివరాలు ఇవే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 841 అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 మార్చి 2021. 10వ తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు. నెలకు రూ.10940 /- - రూ.23700/- వరకు జీతం ఉంటుంది. ఏప్రిల్ 9వ తేదీ, 10వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
సంస్థ పేరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అటెండెంట్
పోస్టుల సంఖ్య: 841
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 మార్చి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత
వయస్సు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు, భాషా ప్రావీణ్యత పరీక్ష
వేతనం: నెలకు రూ.10940 /- - రూ.23700/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.50/-
ఇతరులకు: రూ.450/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 24 ఫిబ్రవరి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 మార్చి 2021
పరీక్ష తేదీ: 9 ఏప్రిల్ మరియు 10 ఏప్రిల్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.rbi.org.in/












Click it and Unblock the Notifications