RBI Recruitment: 300లకుపైగా ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 300 ఖాళీల భర్తీ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ https://rbi.org.inలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డ్ (బోర్డ్) అసిస్టెంట్ మేనేజర్‌లు (రాజభాష), అసిస్టెంట్ మేనేజర్లు (ప్రోటోకాల్ & సెక్యూరిటీ) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. గ్రేడ్ 'A'లో అసిస్టెంట్ మేనేజర్లు (ప్రోటోకాల్ & సెక్యూరిటీ), గ్రేడ్ 'B'లో అధికారుల పోస్టులు ఉన్నాయి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఖాళీల సంఖ్య, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

RBI రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీ వివరాలు
గ్రేడ్ 'B'(DR)లో అధికారులు- జనరల్: 238
గ్రేడ్ 'B'(DR)లో అధికారులు- DEPR: 31
గ్రేడ్ 'B'(DR)లో అధికారులు- DSIM: 25
అసిస్టెంట్ మేనేజర్ - రాజభాష: 06
అసిస్టెంట్ మేనేజర్ - ప్రోటోకాల్ & సెక్యూరిటీ: 03
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2022: చివరి తేదీ
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 18 (సాయంత్రం 6:00 గంటల వరకు).
RBI ఉద్యోగాలు 2022: దరఖాస్తు రుసుము
గ్రేడ్ 'బి'లోని అధికారుల కోసం:
జెన్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ. 100.
అసిస్టెంట్ మేనేజర్ కోసం: Gen, OBC, EWS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 600. SC, ST, PwBD కేటగిరీ అభ్యర్థులకు ఇది రూ. 100.
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్‌లలో నింపిన వివరాలను జాగ్రత్తగా పూరించి, ధృవీకరించాలని సూచించారు, ఎందుకంటే సమర్పించిన తర్వాత ఎటువంటి మార్పు సాధ్యం కాదు.
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications