SBIలో 1194 ఆడిటర్ పోస్టులు.. పరీక్ష లేదు.. ఇప్పుడే అప్లై చేసుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంకరెట్ ఆడిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. SBI రిటైర్డ్ ఆఫీసర్లు, అసోసియేట్స్ (ఈ-ఏబీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 1194 పోస్టులను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 18న ప్రారంభం కానుంది. 2025 మార్చి 15న ముగుస్తుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
మొత్తం పోస్టులు : 1194, SBI రిటైర్డ్ ఆఫీసర్లు, అసోసియేట్స్ (ఈ-ఏబీ)ఆఫీసర్లు, అహ్మదాబాద్ 124 పోస్టులు, భువనేశ్వర్ 50 పోస్టులు,హైదరాబాద్ 79 పోస్టులు, మహారాష్ట్ర 91 పోస్టులు,
ముంబై మెట్రో 16 పోస్టులు, న్యూఢిల్లీ 68 పోస్టులు, తిరువనంతపురం 52 పోస్టులు.

దరఖాస్తు ప్రారంభం : ఫిబ్రవరి 18
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 15
ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ చేసిన వారికి ఇంటర్వ్యూలు ఉంటాయి. బ్యాంక్ ద్వారా ఏర్పాటు చేయబడిన షార్ట్ లిస్టింగ్ కమిటీ షార్ట్ లిస్టింగ్ పారామీటర్లను నిర్ణయిస్తుంది.
ఆ తరువాత, బ్యాంక్ నిర్ణయించిన విధంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూలో సాధించిన స్కోర్ల క్రమంలో తుది ఎంపికకు మెరిట్ జాబితాను తయారు చేస్తారు.












Click it and Unblock the Notifications