ఎస్బీఐ గోల్డెన్ ఛాన్స్.. రూ.48,480 జీతంతో ఉద్యోగాలు

బ్యాంకింగ్ రంగంలో జాబ్ చేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్ధులకు గోల్డెన్ ఛాన్స్. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు బంపర్ అవకాశాన్ని అందించింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి సంబంధించి కొత్త జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 మే 9 నుండి మే 29 మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

SBI CBO పోస్టుల పూర్తి వివరాలు..

మొత్తం ఖాళీలు..

2964

తెలుగు రాష్ట్రాల్లో అవకాశాలు..

హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ): 233 పోస్టులు

అమరావతి సర్కిల్ (ఆంధ్రప్రదేశ్): 186 పోస్టులు

sbi-offers-jobs-with-a-salary-of-rs-48-480

రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు..

అహ్మదాబాద్ - 240

కర్ణాటక - 250

మధ్యప్రదేశ్ & ఛత్తీస్‌గఢ్ - 200

ఒడిశా - 100

హర్యానా - 306

జమ్ము, కశ్మీర్, లడఖ్, పంజాబ్ - 80

తమిళనాడు & పుదుచ్చేరి - 120

నార్త్‌ఈస్ట్ - 100

రాజస్థాన్ - 200

కోల్‌కతా - 150

లఖ్‌నవూ - 280

మహారాష్ట్ర - 250

ముంబై మెట్రో (గోవా సహా) - 100

న్యూఢిల్లీ - 30

తిరువనంతపురం - 90

అర్హత..

ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత.

బ్యాంకింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి..

21 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ( 1995 మే 1 - 2004 ఏప్రిల్ 30 మధ్య జన్మించిన వారై ఉండాలి)

వయో సడలింపు..

SC/ST - 5 సంవత్సరాలు

OBC - 3 సంవత్సరాలు

PwD (General/EWS) - 10 సంవత్సరాలు

జీతం..

నెలకు రూ. 48,480/-

ఎంపిక విధానం..

ఆన్‌లైన్ రాత పరీక్ష (ప్రిలిమినరీ)

స్క్రీనింగ్ టెస్ట్

ఇంటర్వ్యూ

లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (అవసరమైతే)

ప్రిలిమినరీ పరీక్ష వివరాలు..

మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 30 మార్కులు, బ్యాంకింగ్ నాలెడ్జ్ - 40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ / ఎకానమీ - 30 మార్కులు, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ - 20 మార్కులకు ఉంటుంది. మొత్తం పరీక్ష సమయం 2 గంటలు కాగా.. నెగిటివ్ మార్కింగ్ అమలులో ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు..

హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అనంతపురం, గుంటూరు/విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం

దరఖాస్తు విధానం..

ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు..

SC/ST/PwD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు

ఇతరులకు రూ. 750/-

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రారంభం: 2025 మే 9

చివరి తేది: 2025 మే 29

హాల్ టికెట్ డౌన్‌లోడ్: జూలై 2025

పరీక్ష తేదీ: జూలై 2025 (అంచనా)

నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ చక్కటి అవకాశంగా చెప్పొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in ను చూడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+