భారీ జీతంతో SECLలో 543 ఉద్యోగాలు.. కానీ కండిషన్ అదే !
కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited)కు చెందిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) తీపి కబురు ప్రకటించింది. తమ సంస్థలో తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ కేటగిరీలో 543 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులకు SECLలో ఇప్పటికే పర్మినెంట్, రెగ్యులర్‌గా పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి నవంబర్ 9, 2025 తో గడువు ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
సెలెక్ట్ అయిన ఉద్యోగులు 'అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్) గ్రేడ్-సి' పోస్టులో నియమితులు అవుతారు. ఇది ప్రమోషన్ ఆధారిత నియామకం, కాబట్టి ప్రస్తుత జీతం రక్షణ ఉంటుంది. గ్రేడ్-సి స్కేల్ ప్రకారం అన్ని అలవెన్సులు వర్తిస్తాయి. ఆప్షన్ A(I) కింద ఎంపికైన వారు మొదట ట్రైనీగా 2 సంవత్సరాలు, తరువాత రూల్స్ ప్రకారం రెగ్యులర్‌గా గ్రేడ్-సి పోస్టులో చేరతారు.

మొత్తం ఖాళీలు..
543
కేటగిరీల వారీగా పోస్టులు..
UR (జనరల్): 356
SC: 118
ST: 48
PWBD: 21
ఈ పోస్టులకు SECLలో ఇప్పటికే పర్మినెంట్, రెగ్యులర్‌గా పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు.
పోస్టుల వివరాలు..
ఆప్షన్ A(I) - ట్రైనీ పోస్ట్..
AICTE గుర్తింపు పొందిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో కనీసం 3 సంవత్సరాల డిప్లొమా/డిగ్రీ. SECLలో కనీసం 3 సంవత్సరాల సేవ అనుభవం ఉండాలి. ఎంపికైన వారు మొదట 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్‌లో ఉంటారు.
ఆప్షన్ A(II) - డైరెక్ట్ పోస్ట్..
డిప్లొమా లేదా నాన్-డిప్లొమా అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. కానీ వారికి చెల్లుబాటు అయ్యే ఎలక్ట్రికల్ సూపర్‌వైజరీ సర్టిఫికెట్ (Mines Regulations ప్రకారం) తప్పనిసరి.
వయస్సు పరిమితి..
ఇది డిపార్ట్‌మెంటల్ ఎంపిక కాబట్టి, వయస్సు పరిమితి ఉండదు. కానీ సెప్టెంబర్ 30, 2025 నాటికి అర్హతలు మరియు అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష (Written Test) ద్వారా జరుగుతుంది. OMR పద్ధతిలో మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటీ / రీజనింగ్ / క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 20 మార్కులు.. జనరల్ అవేర్‌నెస్ (CIL/SECL గురించి) 20 మార్కులు.. సబ్జెక్ట్ నాలెడ్జ్ (ఎలక్ట్రికల్) 60 మార్కులకు ఉండనున్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపిక కావాల్సిన వారికి జనరల్ అభ్యర్థులు - కనీసం 35 శాతం.. SC/ST అభ్యర్థులు - కనీసం 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం..
SECL ఉద్యోగులు కేవలం ఆన్‌లైన్ మోడ్‌లోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు SECL ఇంటర్నల్ LAN సిస్టమ్ (LAN-connected computer) ద్వారా మాత్రమే సమర్పించవచ్చు.పోర్టల్‌లో లాగిన్ అయ్యి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు ఫీజు..
ఈ పోస్టులకు ఏ అప్లికేషన్ ఫీజు ఉండదు. అర్హులైన SECL ఉద్యోగులు ఉచితంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు గడువు..
అక్టోబర్ 16 నుండి నవంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ ఇంకా ప్రకటించలేదు (పోర్టల్ లేదా SECL వెబ్‌సైట్‌లో తెలియజేస్తారు). మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్: https://portals.secl-cil.in/internal/index.php సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications