Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ఆదేశాలు

హైదరాబాద్: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో నూతనంగా 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బోధనాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా నేరుగా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

తెలంగాణలో వైద్య విద్యను ప్రోత్సహించడంతోపాటు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుతోపాటు అవసరమైన డాక్టర్లు, నర్సులను, ఇతర సిబ్బందిని భర్తీ చేయాలని నిర్ణయించింది.

Telangana Government order to recruit 1827 staff nurse posts.

ఇందులో భాగంగానే ఇప్పటికే 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా, ఇప్పుడు 1827 మంది స్టాఫ్ నర్సులను భర్తీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరిందన్నారు. వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అవుతుండటంతో పాటు, తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య చేరువ అవుతున్నదన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+