తెలంగాణలో జిల్లా జడ్జి పోస్టుల భర్తీకి నోటిపికేషన్: వెంటనే దరఖాస్తు చేయండి, అర్హతలివే

హైదరాబాద్: తెలంగాణ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌లో 13 జిల్లా జడ్జి (ఎంట్రీ లెవల్‌) పోస్టులకు హైకోర్టు శనివారం నోటిఫికేషన్‌ జారీచేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, జీతభత్యాలు, ఎంపిక విధానం వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం ఖాళీల సంఖ్య: 13
జిల్లా జడ్జి(ఎంట్రి లెవల్) పోస్టులు

వయో పరిమతి:
అభ్యర్థుల వయస్సు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం:
నెలకు రూ. 51,550 నుంచి రూ. 63,070 వరకు ఉంటుంది.

 telangana high court recruitment 2022: apply for 13 district judge posts

అర్హతలు:
ఏడేళ్లకు తగ్గకుండా అడ్వకేట్‌గా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.

ఎంపిక విధానం:
రాత పరీక్ష, వైవా వాయిస్(ఇంటర్వ్యూ) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

రాత పరీక్ష విధానం:
సివిల్ లా, క్రిమినల్ లా, ఇంగ్లీష్ అనే మూడు పేపర్లకు రాత పరీక్ష ఉంటుంది.
ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. 3 గంటలపాటు పరీక్ష. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా నిర్వహిస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

జనరల్ అభ్యర్థులకు: రూ. 1000
ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు : రూ. 500

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
'
దరఖాస్తులకు చివరి తేదీ: మే 2, 2022(సాయంత్రం 5గంటలలోపు)

చిరునామా: The Chief Secretary, Government of Telangana, General Administration, Burgula Rama Krishna Rao Bhavan, 9th floor, Adarsh Nagar, Hyderabad-500053.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+