TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!

తెలంగాణలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు (telangana intermediate results 2024) వెలువడ్డాయి. హైదరాబాద్ లో అధికారులు ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను కూడా ఒకేసారి విడుదల చేశారు. వీటిని ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. కాసేపట్లో విద్యార్ధులు వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు.

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్లు tsbie.cgg.gov.in, results.cgg.gov.in, bse.telangana.gov.in, లేదా bseresults.telangana.gov.in లలో అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి విద్యార్ధులు వీటిలో ఏ వెబ్ సైట్ లోకి వెళ్లి అయినా హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్లలోనే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు కూడా అందుబాటులో ఉంచుతున్నారు.

telangana intermediate results 2024 results released- here is how to check

తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో దాదాపు 10 లక్షల మంది రాశారు. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్ కేటగిరీ విద్యార్దులతో పాటు ఒకేషనల్ విద్యార్ధులు కూడా ఉన్నారు. ఈ పరీక్షల పత్రాల్ని తాజాగా మూల్యాంకనం, ఆన్ లైన్ మార్కుల అప్ లోడింగ్ పూర్తి చేశారు. ఇవాళ వీటి ఫలితాలను విడుదల చేశారు. వెబ్ సైట్లోనూ విడివిడిగా ఫలితాలను అందుబాాటులో ఉంచారు.

ఇవాళ విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్ లో 60 శాతం, సెకండియర్ లో 64 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు టాప్ లో నిలిచాయి. ఇంటర్ సెకండియర్ లో ములుగు జిల్లా టాప్ లో నిలిచింది. సాయంత్రం 5 గంటల నుంచి ఆన్ లైన్ లో మార్కు లిస్ట్ లు అందుబాటులో ఉంచుతామని అధికారులు ప్రకటించారు. మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+