TOMCOM: నెలకు రూ.1.3 లక్షల జీతం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..!
తెలంగాణలోని నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి టామ్ కామ్ విదేశాల్లో ఉద్యోగాల కోసం పలువురిని రిక్రూట్ మెంట్ చేసింది. తాజాగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ , తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ కింద రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ.. ఇజ్రాయెల్‌లో ఉద్యోగాల కోసం నియమాకాలు చేపట్టింది.
ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు సంరక్షణ సేవల్లో సంబంధిత అనుభవం, అర్హతలు కలిగి ఉండాలని అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తుదారులు 25, 45 సంవత్సరాల మధ్య ఉండాలి.. కనీసం రెండు సంవత్సరాల చెల్లుబాటుతో పాస్‌పోర్ట్ కలిగి ఉండాలని వివరించారు. హైదరాబాద్‌లో జాబ్ డ్రైవ్‌లో ఎంపిక చేసిన తర్వాత, అభ్యర్థులు నెలవారీ జీతం రూ. 1.3 లక్షలు అందుకుంటారని ప్రకటించారు.

ప్రారంభ కాంట్రాక్ట్ వ్యవధి రెండేళ్లు ఉంటుందని.. తర్వాత అవసరమైతే పొడిగించే అవకాశం ఉందని వివరించారు. అభ్యర్థులు వారానికి ఆరు రోజులు పని చేస్తారని పేర్కొన్నారు. తొమ్మిది మతపరమైన సెలవులు, 16 రోజుల వార్షిక సెలవులు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు తమ రెజ్యూమ్‌ని [email protected]కి పంపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 8247838789, 8019459189, లేదా 7893566493 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications