5204 స్టాఫ్ నర్సు పోస్టులు: దరఖాస్తు గడువు పొడిగింపు, వెంటనే అప్లై చేయండి

తెలంగాణ ప్రభుత్వం గత డిసెంబర్ నెలలో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. దరఖాస్తు గడువు తేదీని ఫిబ్రవరి 21 వరకు పొడిగించారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గత డిసెంబర్ నెలలో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపర్చాలనే ఉద్దేశంతో వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు వైద్యారోగ్య శాఖలో 5204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

5204 స్టాఫ్ నర్సుల పోస్టులలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కింద 3823 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 757 పోస్టులు ఉన్నాయి. ఎంఎన్జే ఆస్పత్రిలో 81 పోస్టులు సహా వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేసేలా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే, దరఖాస్తునకు గడువు ముగిసింది.

 Telangana staff nurse last date of application extended to Feb 21.

ఈ క్రమంలో అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులకు పొడిగించిన గడువు తేదీని ఫిబ్రవరి 21గా నిర్ణయించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 21లోగా అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+