గ్రూప్-1 ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం.. TGPSC విజ్ఞప్తి
రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలపై వస్తున్న తప్పుడు వార్తలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతి త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు వెల్లడిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. మార్కుల జాబితాను వెబ్‌సైల్‌లో పెడతామని తెలిపింది.
అభ్యర్థుల లాగిన్‌లో పేపర్ల వారీగా మార్కులు ఉంచుతామని టీజీపీఎస్సీ వెల్లడించింది. గ్రూప్-1 నియామ ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతోందని స్పష్టం చేసింది. ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపింది. అభ్యర్థులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని టీజీపీఎస్సీ విజ్ఞప్తి చేసింది.

ఎంబీఏ కోర్సుల పరీక్ష తేదీలు ఖరారు
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్ - ఈవినింగ్) కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను మార్చి 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.
వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రమైన ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ రెగ్యులర్ పరీక్ష ఫలితాలతో పాటు డిగ్రీ కోర్సుల సప్లమెంటరీ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.
-
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications