వైద్య విద్యా రంగంలోకి 3 ఐఐటీలు..! టార్గెట్ డాక్టర్ల తయారీ కాదు ..! ఏంటో తెలుసా ?

మన దేశంలో ఐఐటీలు (IITs) అంటే సాంకేతిక విద్యా సంస్థలే. టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలతో పాటు స్టార్టప్ లకు ఊతమిస్తున్న ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థలుగానే ఐఐటీలు ఇప్పటివరకూ పనిచేసాయి. కానీ కాలం మారుతోంది. దాంతో పాటే ప్రపంచం అవసరాలు మారుతున్నాయి. వాటికి అనుగుణంగా తామూ మారకపోతే డైనోసార్లలా తాము కూడా అంతమైపోతామన్న భయమో, మరో కారణమో తెలియదు కానీ.. ఐఐటీలు కూడా తమ రూపురేఖలు మార్చుకుంటున్నాయి. ఇప్పటివరకూ అందించిన సాంకేతిక విద్యకు తోడు వైద్య విద్యను కూడా బోధించేందుకు సిద్ధమవుతున్నాయి.

Startup Revolution: ఉద్యోగాల కోసం కాదు.. కంపెనీలు పెట్టేందుకే! టాప్ కాలేజీల్లో కొత్త ట్రెండ్..!
Startup Revolution: ఉద్యోగాల కోసం కాదు.. కంపెనీలు పెట్టేందుకే! టాప్ కాలేజీల్లో కొత్త ట్రెండ్..!

ఇందులో భాగంగా తాజాగా ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్ పూర్, ఐఐటీ మద్రాస్ ఒకే సమయంలో, పూర్తిగా భిన్న మార్గాల్లో వైద్య విద్యారంగంలోకి అడుగుపెడుతున్నాయి. అయితే ఇవి వైద్య విద్యలో భాగంగా డాక్టర్ల తయారీకి మాత్రం సిద్దం కావడం లేదు. అలాగే
ఈ మూడు సంస్థలు మిగతా రెండు సంస్థల్ని అనుసరించడం లేదు కూడా. ఇందులో ఐఐటీ కాన్పూర్ ఉన్నత, సూపర్-స్పెషాలిటీ వైద్య డిగ్రీలను, అంటే ఒక జనరల్ ఫిజీషియన్‌ను కార్డియాలజిస్ట్‌గా లేదా న్యూరోసర్జన్‌గా మార్చే ఎండీ, డీఎం, ఎంసీహెచ్ అర్హతలను, బహుళ-విషయ పరిశోధనా కార్యక్రమాలతో పాటు ప్రారంభిస్తుందని ప్రొఫెసర్ అనిల్ కే. లల్వానీ ఇండియాటుడేతో మాట్లాడుతూ వెల్లడించారు. చాలా మంది భారతీయులు డాక్టర్ కావడానికి గుర్తుగా భావించే ఎంబీబీఎస్ డిగ్రీ, ఈ మార్గంలో 3 నుండి 4 సంవత్సరాల తర్వాత వస్తుంది.

Three IITs Enter Medical Education With a Focus Beyond Training More Doctors
ఒరాకిల్ సహా 22 కంపెనీలకు ఐఐటీల భారీ షాక్..! క్యాంపస్ ఇంటర్వూలపై బ్యాన్..!
ఒరాకిల్ సహా 22 కంపెనీలకు ఐఐటీల భారీ షాక్..! క్యాంపస్ ఇంటర్వూలపై బ్యాన్..!

అలాగే ఐఐటి ఖరగ్‌పూర్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2001లోనే ప్రారంభించారు. అప్పటికే డాక్టర్లుగా ఉన్నవారికి ఇంజనీరింగ్, భౌతిక శాస్త్రాలను బోధించేందుకు ప్రత్యేకంగా దీని ఎంఎంఎస్‌టి (MMST) కార్యక్రమాన్ని రూపొందించారు. అప్పటి నుండి ఇది ఒక ఆసుపత్రిని నిర్మించి, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులకు అనుమతులు తెచ్చుకుంది. అలాగే ఈ పూర్తిస్థాయి మార్పు విషయంలో ఐఐటి మద్రాస్ ఇంకా స్పష్టంగా ఉంది. తమ సంస్థ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబిబిఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎండి, డాక్టరల్ పిహెచ్‌డిలను ప్రదానం చేసే ఒక వైద్య శాస్త్రాల పాఠశాలను ప్రారంభిస్తుందని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి ఇండియా టుడే డిజిటల్ తో చెప్పారు. ఇలా మూడు ఐఐటీలు వైద్యశాస్త్రాన్ని, సాంకేతికలను మేళవించి కోర్సుల్ని రూపొందించడమే కాకుండా డిగ్రీలు కూడా అందిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+