TMC Jobs 2025: టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతోనే జాబ్

TMC Jobs 2025: ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే చాలు టాటా మెమోరియల్ సెంటర్ లో మంచి ఉద్యోగం పొందవచ్చు. మంచి కంపెనీలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ రిక్రూట్ మెంట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నీషియన్, హౌసి కీపింగ్, కిచెన్ సూపర్ వైజర్ సహా అనేక పోస్టులకు టీఎంసీ(టాటా మెమోరియల్ సెంటర్) నియామకాలను ప్రకటించింది. ఈ నియామకం ద్వారా బీహార్ లోని ముజఫర్ నగర్ లో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు టాటా మెమోరియల్ సెంటర్ అధికారిక వెబ్ సైట్ tmc.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. టాటా మెమోరియర్ సెంటర్ ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలను విడుదల చేసిందో తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు ఇలా..

*సైంటిఫిక్ అసిస్టెంట్ నెట్ వర్కింగ్ -02 పోస్టులు

*కిచెన్ సూపర్ వైజర్-01

*హౌస్ కీపింగ్ సూపర్వైజర్ -1

*అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్ -1

*ఫార్మసిస్ట్ -02 పోస్టులు

*సైంటిఫిక్ అసిస్టెంట్ (ఐటీ ప్రోగ్రామర్)- 1

*టెక్నీషియన్ (సీఎస్ఎస్డీ) -1

*టెక్నీషియన్ (బయోకెమిస్ట్రీ)-1

*టెక్నీషియన్ (హెమటాలజీ)-1

*టెక్నీషియన్ (మైక్రోబయాలజీ) 01

*టెక్నీషియన్ (పాథాలజీ) 01

*టెక్నీషియన్ (ఫ్లెబోటోమిస్ట్) 01

*ఎంఆర్‌డీ టెక్నీషియన్ - 1

*స్పీచ్ స్పెల్లింగ్ - 1

*టెక్నీషియన్ (నెట్‌వర్కింగ్)- 1

*పంప్ ఆపరేటర్ - 4 పోస్టులు

*ఫైర్ మ్యాన్ -6 పోస్టులు

*నర్సులు - 4

*కుక్ - 2

*మొత్తం -33 పోస్టులు

TMC Jobs 2025 Walk-in Interview for Various Posts at Tata Memorial Centre

టీఎంసీ సూపర్ వైజర్, టెక్నీషియన్ అర్హత
ఈ టాటా మెమోరియల్ సెంటర్ రిక్రూట్ మెంట్ లో అభ్యర్థులకు పోస్టును భట్టి వేర్వేరు అర్హతలు నిర్దేశించబడ్డాయి. పదో తరగతి/ఐటీఐ/12వ తరగతి/డిప్లొమా/బీఎస్సీ/జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ, అంకాలజీ నర్సింగ్ లో డిప్లొమా/బీసీఏ/కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్/బీఎస్సీ(హోటల్ మేనేజ్మెంట్) మొదలైన అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 1-3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల అర్హతకు సంబంధించిన ఇతర వివరాలను కూడా అధికారికి నియామక నోటిఫికేషన్ నుంచి వివరంగా తెలుసుకోవచ్చు.

నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.-

*వయోపరిమితి: ఈ ఇంటర్వ్యూకి హాజరు కావడానికి అభ్యర్థుల గరిష్ట వయస్సు ఇంటర్వ్యూ తేదీ నాటికి 27-30 సంవత్సరాలు ఉండాలి.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.22,568 నుండి రూ.33,000/- వరకు జీతం లభిస్తుంది.

*ఇంటర్వ్యూ తేదీ- ఈ పోస్టులకు అభ్యర్థుల ఇంటర్వ్యూలు ఫిబ్రవరి 13-27 వరకు జరుగుతాయి.

*అవసరమైన పత్రాలు- ఇంటర్వ్యూ సమయంలో బయోడేటా, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

*ఈ పోస్టుల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ప్రక్రియలో పాల్గొనడానికి అభ్యర్థులు ముజఫర్‌పూర్‌లోని హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్‌ను చేరుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+