జులై 1న తెలంగాణ గ్రూప్-4 రాత పరీక్ష: వారం రోజుల ముందే హాల్‌టికెట్లు

తెలంగాణ గ్రూప్-4 పోస్టులకు ఈ ఏడాది జులై 1న రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-4 దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. టీఎస్ పీఎస్సీ గ్రూప్-4 పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 8180 గ్రూప్-4 పోస్టులకు దాదాపు 9 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అంటే దాదాపు పోస్టుకు వందమందికిపైనే పోటీ పడుతున్నారు.

కాగా, గ్రూప్-4 పోస్టులకు ఈ ఏడాది జులై 1న రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు.

TSPSC Group 4 Exam will be held on July 1st; week before of exam, hall-tickets will be released

కాగా, హాల్ టికెట్లను పరీక్షకు వారం రోజుల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ పరీక్ష తేదీలు ఇవే:

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12 వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. వీటిలో 11వ తేదీ ఆదివారం కావడంతో ఆరోజు పరీక్ష ఉండదని తెలిపింది. ఇటీవల వెల్లడించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో మొత్తం 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.

హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానంతో రిజర్వేషన్లు చేపట్టినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మల్టీ జోన్, రిజర్వేషన్ ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలు ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ భాషల్లో జరుగుతాయని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌ మినహా మిగతా అన్ని పేపర్‌లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని తెలిపింది. కాగా, గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

టీఎస్‌పీఎస్‌సీ షెడ్యూల్‌ ప్రకారం..
జూన్‌ 5న జనరల్‌ ఇంగ్లిష్‌ (అర్హత పరీక్ష),
జూన్‌ 6న జనరల్‌ ఎస్సే (పేపర్‌-1),
జూన్‌ 7న హిస్టరీ, కల్చర్‌ అండ్‌ జాగ్రఫీ (పేపర్‌-2),
జూన్‌ 8న ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌ (పేపర్‌-3), జూన్‌ 9న ఎకానమీ అండ్‌ డెవలప్‌మెట్‌ (పేపర్‌-4),
జూన్‌ 10న సైన్స్‌ అండ్ టెక్నాలజీ అండ్‌ డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ (పేపర్‌-5), జూన్‌ 12న తెలంగాణ ఉద్యమం అండ్‌ రాష్ట్ర ఆవిర్భావం (పేపర్‌-6) అంశాలపై పరీక్షలు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+