TSPSC Group 4 jobs: 9618 పోస్టుల భర్తీకి సన్నాహాలు, సీఎం వద్దకు ఫైలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో 9వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేసన్ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 4 కోసం ఒకే నోటిఫికేషన్‌ను విడుదల చేయడం ద్వారా తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 9,618 గ్రూప్-4 పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

తాజా మీడియా కథనాల ప్రకారం.. TSPCS గ్రూప్ 4 కోసం సింగిల్ నోటిఫికేషన్ ప్రతిపాదన ఫైల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం పంపారు. తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి తుది నిర్ణయం కోసం వేచి ఉంది. TSPSC గ్రూప్-4లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, టైపిస్టులు, అకౌంటెంట్లు మొదలైన వారి నియామకాలు ఉంటాయి.

TSPSC Group 4 notification 2022: File sent to Telangana CM KCR for approval of 9618 posts.

గ్రూప్-4 పోస్టుల భర్తీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. గ్రూప్-1 పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఇప్పటికే సుదీర్ఘ విరామంలో ఉంది. గ్రూప్-4 కోసం ఒకే నోటిఫికేషన్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల నుంచి సలహా కోరింది. అన్నింటినీ ఒక ఫైల్‌గా రూపొందించి సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపారు.

సీఎం ఆమోదం లభించగానే ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు శాఖల్లో పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+